India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా హిట్ లేదా ప్లాప్‌తో సంబంధం లేకుండా చాలా చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సినిమా విడుదలై ఐదేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక షోలు వేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఈ నెల 20న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇ-కామర్స్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బోర్న్‌విటాతోపాటు అన్ని రకాల పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. బోర్న్‌విటాలో పరిమితికి మించి షుగర్ లెవల్స్ ఉన్నట్లు NCPCR పరిశోధనలో తేలింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా పవర్ సప్లిమెంట్లను హెల్త్ డ్రింక్స్‌గా ప్రచారం చేసుకుంటోన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని FSSAIని NCPCR ఇటీవల కోరింది.

ఆటోల వెనుక సినిమాల పేర్లు, హీరోల ఫొటోలు, లవ్ కొటేషన్లు తరచూ చూస్తుంటాం. అయితే HYDలో ఓ వ్యక్తి తన ఆటో వెనుక ముద్రించిన కొటేషన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘ఎప్పుడైనా చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తాడని కాకుండా.. మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం పడుతుందని చెప్పండి’ అని రాశారు. దాని పక్కన చిగురిస్తున్న చెట్టు బొమ్మను వేసి ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేశారు.

వేసవిలో ఎండ తాపం తట్టుకోవాలంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చల్లని మజ్జిగ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు. మజ్జిగ వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. కొన్ని రకాల జబ్బులను కూడా మజ్జిగ నియంత్రిస్తుంది. ఎముకలు దృఢంగా మారతాయి. మజ్జిగ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

TG: ఈసారి ‘IPL’ (ఇండియన్ పొలిటికల్ లీగ్) కప్ తమదేనని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఐపీఎల్‌తోపాటు ‘టీపీఎల్’ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కూడా మాదే. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు. బీఆర్ఎస్‌కు ఆటగాళ్లున్నా ఫామ్‌లో లేరు. కిషన్‌రెడ్డి కెప్టెన్సీలో బీజేపీ టీమ్ దూసుకుపోతుంది. 17 సీట్లు సాధించి టీపీఎల్ కైవసం చేసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.

నిన్నటి మ్యాచులో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ పరిస్థితి దారుణంగా ఏమీ లేదన్నారు. వందశాతం ఫిట్‌నెస్ ఉంటేనే ఆడించాలని అనుకున్నట్లు చెప్పారు. మయాంక్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. మరో రెండు మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. తిరిగి జట్టులోకి వస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందన్నారు.

IPLలో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి యుజ్వేంద్ర చాహల్(RR) చేరువలో ఉన్నారు. మరో 3 వికెట్లు తీస్తే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం అతను 150 మ్యాచ్‌లలో 197 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బ్రావో(183), చావ్లా(181), అమిత్ మిశ్రా(173), భువనేశ్వర్(173), అశ్విన్(172) ఉన్నారు. వీరిలో బ్రావో తప్ప మిగతా అందరూ ఇంకా క్రికెట్ ఆడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన మహిళ అనే కారణంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి రాకుండా అడ్డుకున్నారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ మతంతో పాటు గిరిజనుల చరిత్ర, ఐడియాలజీపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో కుల గణన చేపడతామని అన్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్‌లో విచక్షణారహితంగా కత్తులతో చేసిన దాడిలో ఐదుగురు మరణించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితులపై కాల్పులకు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు మరణించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

AP: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని, దానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమవరం, గాజువాకలో ఓడిన పవన్ కళ్యాణ్.. ఈసారి కొత్తగా పిఠాపురంలో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సెగ్మెంట్‌లో YCP నుంచి వంగా గీత బలమైన అభ్యర్థి అని పేర్కొన్నారు. మొదటి నుంచి జనసేనలో ఉన్నవారికి పవన్ న్యాయం చేయలేదని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.