India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఈ లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సినీ నటుల పోటీయే ఇందుకు కారణం. ఇప్పటికే పోటీ చేసిన వారు కొందరైతే.. ఇంకొందరు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. BJP నుంచి హేమా మాలిని(మథుర, UP), స్మృతి ఇరానీ(అమేఠీ, UP), కంగన(మండీ, HP), రవికిషన్(గోరఖ్‌పూర్, UP), నవనీత్‌కౌర్(అమరావతి, MH), రాధిక(విరుదు నగర్, TN), TMC నుంచి రచనా బెనర్జీ(హుగ్లీ, WB) పోటీ చేస్తున్నారు. ఇలా 20మందికిపైగా ఉన్నారు.<<-se>>#Elections2024<<>>

యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూతురు ఆదితి యాదవ్ హైలెట్‌గా నిలుస్తున్నారు. ఆమెను చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. ఆమె కూడా తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. బీజేపీ, మోదీని విమర్శిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కాగా లండన్‌లో చదువుతున్న ఆదితి.. సెలవులు కావడంతో తన తల్లి డింపుల్ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.

AP: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఈనెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. 18న నోటిఫికేషన్ రానుంది. దీంతో ఆయన 21న సొంత నియోజకవర్గానికి చేరుకోని, రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పులివెందుల నియోజకవర్గంలో తన తరఫున సతీమణి భారతికి ప్రచార బాధ్యతలు అప్పగించి, జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర కొనసాగిస్తారని సమాచారం.

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియే కుటుంబసభ్యులు మరణించారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన ఈ దాడిలో ఆయన ముగ్గురు కుమారులు అమిర్ హనియే, హజీమ్ హనియే, మహ్మద్ హనియే చనిపోయారు. వీరితోపాటు ఆయన నలుగురు మనవళ్లు కూడా ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం ఇస్మాయిల్ హనియే ఖతర్‌లో నివసిస్తున్నారు. కాగా రంజాన్ రోజు కూడా తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్లు తెలుస్తోంది. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పడుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో, 261 బీసీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సెట్ కన్వీనర్ బి.సైదులు తెలిపారు. ఈనెల 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలోని 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు.

TG: మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. పి.గన్నవరం, అమలాపురంలో ప్రజాగళం పేరుతో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉదయం రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రచారంలో భాగంగా అమలాపురంలో 6 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచార తీరును చూసేందుకు బీజేపీ 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అందుకు జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి 13 దేశాల్లోని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో భారత్‌కు రానున్న ఆయా దేశాల పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాలను చూడనున్నారు. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడి పార్టీలను బీజేపీ ఆహ్వానించలేదు.
Sorry, no posts matched your criteria.