News April 5, 2024

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

image

1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రభోదానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి
మరణం

News April 5, 2024

నేడు కూటమి పార్టీల సమన్వయ సమావేశాలు

image

AP: టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు. కూటమి నిర్వహణ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు.

News April 5, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 5, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55 సూర్యోదయం: ఉదయం గం.6:07
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 5, 2024

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

image

తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2019లో 67.40శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లో పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.

News April 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 5, 2024

రెండేళ్లలో చిన్నకార్లకు డిమాండ్ ఏర్పడుతుంది: ఆర్‌సీ భార్గవ

image

చిన్నకార్ల అమ్మకాలు భారత్‌లో మరో రెండేళ్లలో పుంజుకుంటాయని మారుతీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. బైక్‌ల నుంచి కార్లకు మారాలి అనుకునే వారు నేరుగా SVUలను కొనుగోలు చేయరని.. దీంతో చిన్నకార్లకు డిమాండ్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా నిర్వహణ వ్యయాలు, ట్యాక్సులు, కర్భన ఉద్గార నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా చిన్న కార్లు, బైక్‌ల ధరలు పెరిగాయి. దీంతో గతేడాది చిన్నకార్ల విక్రయాలు 12% మేర పడిపోయాయి.

News April 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 5, 2024

TODAY HEADLINES

image

✒ AP: ఇంటర్ కాలేజీలకు మే 31 వరకు సెలవులు
✒ AP: టిప్పర్ డ్రైవర్లకూ రూ.10,000: CM జగన్
✒ AP: పోలీసులు జగన్‌ను లోపల వేయాలి: CBN
✒ AP: చంద్రబాబుకు EC నోటీసులు
✒ AP: అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి: CBI
✒ TG: టెస్లాతో చర్చలు జరుపుతున్నాం: శ్రీధర్ బాబు
✒ TG: ఫోన్ ట్యాపింగ్‌లో KCR ప్రమేయం: కిషన్ రెడ్డి
✒ TG: నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టింది: KTR
✒ TG: కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

News April 5, 2024

జూన్‌లో ‘రాయన్’?

image

సూపర్‌స్టార్‌ ధనుశ్ నటిస్తున్న 50వ చిత్రం ‘రాయన్’. ఈ మూవీలో ధనుశ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. జూన్ 7న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

News April 4, 2024

BREAKING: పంజాబ్ సూపర్ విక్టరీ

image

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. 111 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 29 బంతుల్లోనే 4 సిక్సులు, 6 ఫోర్లతో 61 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో ఎండ్‌లో అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులతో రాణించారు.