India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
TG: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై చర్చ నడుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 20 నుంచే సెలవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్కూళ్లకు ఎప్పట్నుంచి సెలవులు ఇస్తారనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ముందే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలోనే దీనిపై విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా త్వరలోనే టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. USకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు తప్పక ఉంటాయన్నారు. USలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావట్లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. IND సహా పలు దేశాలపై US ఇప్పటికే టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
AP: విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.
ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి తహవూర్ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులు USకు చేరుకున్నట్లు సమాచారం. ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తీసుకువచ్చే అవకాశముంది. ఢిల్లీలోని NIA హెడ్ క్వార్టర్స్‌లో అతడిని విచారించనున్నారు. ఇప్పటికే అక్కడ భద్రత పటిష్ఠం చేశారు. కాగా పాక్‌కు చెందిన రాణా తనను భారత్‌కు అప్పగించొద్దని కోరగా US సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న ‘హిట్ 3’ సినిమా నుంచి ఇవాళ సెకండ్ సింగిల్ విడుదల కానుంది. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. నిన్న రాజస్థాన్‌లోని బార్మర్‌లో దేశంలోనే అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువని IMD వెల్లడించింది. రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని 27 ప్రాంతాల్లో 43 డిగ్రీల పైనే ఎండలు రికార్డయ్యాయని తెలిపింది. మరో 17 చోట్ల వడగాలులు హడలెత్తించాయని పేర్కొంది. ఇటు దక్షిణాదిన కూడా ఎండలు అదరగొడుతున్నాయి.
AP: టీడీపీ అనుకూల పోలీసులను చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతామన్న <<16030703>>YS జగన్ వ్యాఖ్యలను<<>> పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే న్యాయపోరాటం చేస్తామని తెలిపింది. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారని జగన్ మరిచారా అని ప్రశ్నించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.