India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(CGHS) లబ్ధిదారులకు ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వం ‘మైసీజీహెచ్‌ఎస్’ యాప్‌ను ప్రారంభించింది. IOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో ఇది పని చేస్తుంది. ఈ యాప్‌లో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, క్యాన్సిల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి.

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేయనుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటివ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఈ మేనిఫెస్టోను ఢిల్లీలో ఆవిష్కరిస్తారు.

అత్యవసర ఔషధాల ధరలు పెరగనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కొట్టిపారేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదల లేనందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఔషధాల ధరలు పెరగవని చెప్పారు. టోకు ధరల ఆధారంగానే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా రేట్లను సవరిస్తుంటుందని తెలిపారు.

టాలీవుడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ రూపొందించిన సేవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్‌లో సీజన్ 1, 2లకు మంచి రెస్పాన్స్ రావడంతో సీజన్-3ని కూడా రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. జూన్ నెల నుంచి సీజన్ 3 షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. కాగా సీజన్ 1, 2లు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. టాప్2లో సీజన్-2 ట్రెండింగ్‌లో ఉంది.

AP: అరకు ఎంపీ స్థానంలో CPM పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు తెలిపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అసెంబ్లీకి సంబంధించిన చర్చల్లో కొన్ని తేడాలున్నాయి. కాంగ్రెస్‌కు గతంలో తక్కువ ఓట్లు వచ్చిన స్థానాలనే అడుగుతున్నాం. TDP, BJP, జనసేనది అపవిత్ర పొత్తు. ఏ మొహం పెట్టుకుని మూడు పార్టీలు కలిశాయి’ అని మండిపడ్డారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- CPM- CPI కలిసి పోటీ చేస్తున్నాయి.

డీమార్ట్ స్టోర్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ తిరిగి రూ.3లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈ ఇంట్రాడేలో కంపెనీ షేరు వాల్యూ 6 శాతం పెరిగి రూ.4710.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్న ట్రేడింగ్ ముగిసే నాటికి కంపెనీ విలువ రూ.3,02,405 కోట్లకు చేరుకుంది. 2021 అక్టోబర్‌లో ఈ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.3లక్షల కోట్లకు చేరింది.

రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మూవీ టైటిల్‌ను ఈ నెల 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. కాగా చిత్రానికి ‘కళుగు’ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి తెలుగులో ‘డేగ’ అని అర్థం. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రేపు ఏకంగా 109 మండలాల్లో తీవ్ర వడగాలులు, 206 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ మండలాల లిస్టు కోసం ఇక్కడ <

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసుని నీరుగార్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఈ కేసులో బయటపడ్డ వందల కోట్లు, పేదల నుంచి లాక్కున్న భూములు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అక్రమాల్లో పాలుపంచుకున్న పోలీసు అధికారులు, నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం రేవంత్ చొరవ తీసుకుని ఈ కేసుని మళ్లీ తెరిచి విచారణ జరపాలని కోరారు.
Sorry, no posts matched your criteria.