India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా టీ20 WC గెలవడంపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించారు. ‘వరల్డ్ కప్ ఛాంపియన్స్-2024, నా హార్ట్‌రేట్ పెరిగిపోయింది. ప్రశాంతంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో మీరు చేయాలనుకున్నది చేశారు. WC అందించినందుకు భారతీయులందరి తరఫున ధన్యవాదాలు. అరే.. నా పుట్టినరోజుకు వెలకట్టలేని బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. జులై 7న ధోనీ బర్త్‌డే కాగా.. అతడి సారథ్యంలో భారత్ 2007లో T20WC గెలిచింది.

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్(48 మ్యాచ్‌లు, పాక్), బ్రెయిన్ మసాబా(45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ నిలిచారు. 2007 ఆరంభ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో రోహిత్ ఒకరు. ఆ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

AP: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. జులై 4-10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదు, 13న ఆప్షన్ల మార్పు చేసుకోవచ్చు. 16న సీట్ల కేటాయింపు చేస్తారు. విద్యార్థులు 17-22లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఫార్మసీ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటో తేదీన ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా 2023 నుంచి రవి అగర్వాల్ సీబీడీటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. SEP 30తో ఆయన పదవీ కాలం ముగియనుండగా పొడిగించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుత ఛైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం నేటితో ముగియనుంది.

AP: టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తు తరాలకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

TG: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనానికి కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. CM రేవంత్ ఆదేశాలతో మార్చి 6న కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్‌పై అధికారాలు GHMCకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఇది భూమికి 400km ఎత్తులో పరిభ్రమిస్తుంటుంది. US, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.

1928: నటుడు జె.వి. సోమయాజులు జననం
1948: నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ జననం
1982: హీరో అల్లరి నరేష్ జననం
1969: శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య జననం
1917: భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణం
1984: ప్రముఖ తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు మరణం
1988: హాస్యనటుడు సుత్తి వీరభద్ర రావు మరణం
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం.

టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కోహ్లీ సైతం టీ20Iలకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు. వరల్ట్ కప్ గెలవకపోయినా రిటైర్మెంట్ ప్రకటించే వాడినని వ్యాఖ్యానించారు.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందలు తెలియజేశారు. భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని AP సీఎం చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సాకారం చేసిందన్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్‌కు ఎదురు లేదని మరోసారి నిరూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.