News June 30, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 30, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:45 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 30, 2024

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి అభినందనలు

image

టీమ్ ఇండియాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని కొనియాడారు. ఇది అసాధారణ విజయమని.. జట్టుని చూసి దేశం గర్విస్తోందని అన్నారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయం రోహిత్ నాయకత్వానికి నిదర్శమని వ్యాఖ్యానించారు.

News June 30, 2024

ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఉందా?: కేంద్ర మంత్రి

image

బిహార్‌లో వరుసగా <<13531487>>బ్రిడ్జి<<>>లు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మీడియాతో అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఎందుకు ఇలా జరుగుతోందని ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఏమైనా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈ ఘటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

News June 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 30, 2024

విశ్వవిజేతగా భారత్.. ఎమోషనల్ మూమెంట్స్

image

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ టీ20 WCను ముద్దాడింది. ఆ అపురూప క్షణాల్లో భారత ఆటగాళ్లంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు హత్తుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. వారిని చూస్తూ కోట్లాది భారతీయుల కళ్లు చెమర్చాయి. అభిమానులు జయజయధ్వానాలతో స్టేడియం మార్మోగగా.. వారికి రోహిత్ శర్మ అభివాదం చేస్తూ ఘన విజయాన్ని దేశానికి అంకితమిచ్చారు. భావోద్వేగం, ఆనందం, ఉల్లాసం అంటూ ఐసీసీ ఆ ఫొటోలను Xలో పోస్ట్ చేసింది.

News June 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 30, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 30, ఆదివారం
జ్యేష్ఠము
బ.నవమి: మధ్యాహ్నం 12:19 గంటలకు
రేవతి: ఉదయం 07:34 గంటలకు దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:56- 05:48 గంటల వరకు
వర్జ్యం లేదు.

News June 30, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* టీ20 వరల్డ్ కప్-2024 విజేత భారత్
* తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: రేవంత్
* సీనియర్ రాజకీయ నాయకుడు డి.శ్రీనివాస్ మృతి
* కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
* కంటోన్మెంట్ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనానికి కేంద్రం ఆమోదం
* AP: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక: సీఎం చంద్రబాబు
* SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు

News June 30, 2024

T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

image

T20Iలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై ఫైనల్ గెలిచిన అనంతరం రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇదే నా చివరి వరల్డ్ కప్. T20 మ్యాచ్ కూడా. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను వెనక్కి తగ్గుతున్నా. వరల్డ్ కప్ గెలవకపోయినా నేను రిటైర్మెంట్ ప్రకటించే వాడిని’ అంటూ మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 30, 2024

BIG BREAKING: ప్రపంచకప్ గెలిచిన భారత్

image

T20WC థ్రిల్లింగ్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్‌లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్‌ను 169/8 స్కోరుకు టీమ్ ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. హార్దిక్ 3, అర్ష్‌దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.