India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: పార్టీని వీడి దొంగలతో కలిసినోళ్ల గురించి తనకు బాధ లేదని KCR వ్యాఖ్యానించారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ‘తెలంగాణ సాధించిన మనకు ఇదో లెక్కనా? పార్టీనే నాయకులను తయారు చేస్తుంది. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు. మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తాం. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం’ అని గులాబీ దళపతి వ్యాఖ్యానించారు.

రక్షణ, రైల్వే, ఎరువుల రంగాల్లోని పీఎస్‌యూ షేర్లలో కొంతభాగాన్ని విక్రయించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మజగాన్ డాక్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (IRFC), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. ఒక్క IRFC నుంచే కేంద్రానికి ₹7600 కోట్లు రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మి కేంద్రం ₹50వేల కోట్లు రాబట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

AP: తమకు భద్రత పెంచాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రి కావడంతో 5+5 భద్రత ఉండేదని, ఇప్పుడు 1+1 సెక్యూరిటీ కల్పించినట్లు ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేశారు.

AP: ఉండి, నరసరావుపేట వైసీపీ కార్యాలయాల కూల్చివేత నోటీసులపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 18 ఆఫీసుల విషయంలో ఇలాంటి ఆదేశాలిచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. అనుమతుల్లేకుండా వైసీపీ కార్యాలయాలు కడుతున్నారంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

టెస్ట్ క్రికెట్‌లో ఒకరోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాతో టెస్టులో మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి 525/4 రన్స్ చేసింది. పురుషులు, మహిళల టెస్ట్ క్రికెట్‌లో ఒకరోజులో ఇదే అత్యధిక స్కోర్. 2002లో బంగ్లాపై లంక 509/9 రన్స్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో షెఫాలీ 205, స్మృతి మందాన 149 రన్స్‌తో చెలరేగారు. జెమీమా 55 చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం క్రీజులో హర్మన్ 42*, రిచా 43* ఉన్నారు.

AP: రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ‘జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలి. జగన్‌కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు సీఎంకు అంత భద్రత అవసరమా? ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పా. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా’ అని పేర్కొన్నారు.

ఈరోజు సెషన్ ఆరంభంలో ఉన్న జోరును దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి వరకు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 79,032 (-210 పాయింట్లు), నిఫ్టీ 24,010 (-33) వద్ద ముగిశాయి. ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ICICI వంటి బడా షేర్ల నష్టాలు ప్రభావం చూపాయి. మార్కెట్లో స్టాక్స్ విలువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు. దీనిని దేశీయ ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతోందంటున్నారు.

NEETను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నీట్‌కు వ్యతిరేకంగా DMK పోరాటం కొనసాగుతుందని, ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలని CM స్టాలిన్ అన్నారు. చర్చ సందర్భంగా BJP MLA నాగేంద్రన్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. NEETను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌లో US అధ్యక్షుడు జో బైడెన్ ప్రదర్శనపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న వేళ ఆయన అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది. బైడెన్ స్వయంగా తప్పుకుంటే తప్ప మార్పు దాదాపు అసాధ్యమనేది విశ్లేషకుల మాట. ట్రంప్‌కూ ఇదే వర్తిస్తుందంటున్నారు. ఇద్దరికీ వారి పార్టీల్లోని డెలిగేట్స్ మద్దతు ఉండటమే కారణం. త్వరలో సంబంధిత కన్వెన్షన్లలో పార్టీలు వీరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి.

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ IVF ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మా అమ్మ నీతా అంబానీకి నేను, ఆకాశ్ పుట్టినట్లే నాకూ కవలలు పుట్టారు. పిల్లలను కనేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఎందుకు ఉపయోగించవద్దు? దీనిలో తప్పులేదు. మీరు దాచాల్సిన అవసరం కూడా లేదు’ అని ఆమె చెప్పారు.
Sorry, no posts matched your criteria.