India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అంతర్జాతీయ మహిళల టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్) నెలకొల్పిన జోడీగా భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ నిలిచారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో వీరు ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా-కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుత మ్యాచులో భారత్ స్కోరు 379/2గా ఉంది. స్మృతి (149), శుభా సతీశ్ (15) ఔటయ్యారు. షఫాలీ(180), జెమీమా(31) క్రీజులో ఉన్నారు.

AP: ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి గౌరవ <<13525496>>వేతనం<<>> ఇవ్వనున్నారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపరింటెండెంట్స్, డి.తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్టులకు ఇది అందుతుంది. పోలింగ్, కౌంటింగ్‌కు లిమిటెడ్ పీరియడ్‌లో విధులు నిర్వహించిన జోనల్, రూట్, పోలింగ్, కౌంటింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లకు గౌరవ వేతనం అందదు.

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో 90ల్లోకి వచ్చినా శతకం చేజార్చుకున్నారు. ఒకవేళ ఫైనల్‌లోనూ ఏ ఆటగాడు సెంచరీ కొట్టకపోతే ఇది వరల్డ్ కప్ చరిత్రలో ఒక్క శతకం లేని రెండో పర్యాయం అవుతుంది. 2009 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఏ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. కాగా.. ఈ ఏడాది పొట్టి కప్ ఫైనల్ రేపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది.

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు తెర పంచుకున్నారు.

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు మ.3గంటలకు విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైటుతో పాటు WAY2NEWS యాప్‌లో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఫలితాలను ఇతరులకూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

AP: అధికారం ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశామని, ఇప్పుడు వారికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తమ హయాంలో జరిగిన లోపాలను సమీక్షించుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వైసీపీకి ఆదరణ తగ్గలేదని, ఒంటరిగానే 40% ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పింఛన్ తప్ప మరే పథకం గురించి మాట్లాడట్లేదని విమర్శించారు.

‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వేళ నిర్మాత స్వప్న దత్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీశాం’ అని ఆమె పోస్ట్ చేశారు. ‘కల్కి’ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి.

పదేళ్ల NDA పాలనలో అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా నాసిరకం పనులతో మౌలిక వనరులకు నష్టం కలుగుతోందని INC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు, జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు రూఫ్ కూలిపోయాయి. అయోధ్యలో కొత్త రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రామ మందిరం లీకేజీ అవుతోంది. బిహార్‌లో 13 బ్రిడ్జిలు కూలిపోయాయి. గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలి ఘోర విషాదం సంభవించింది’ అని Xలో ఫైరయ్యారు.

సుమారు 1400 మమ్మీలున్న 36 సమాధుల్ని పరిశోధకులు ఈజిప్టులో తాజాగా గుర్తించారు. ఇవి లభ్యమైన ప్రాంతాన్ని ‘అస్వాన్’గా పిలుస్తున్నారు. నైలు నదికి తూర్పు తీరంలో 2.70 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం కనీసం 4500 ఏళ్ల క్రితం నాటిదని, అంటురోగాలు సోకిన వారిని ఇలా సామూహికంగా ఖననం చేసి ఉంటారని భావిస్తున్నారు. వీటిని గుర్తించేందుకు ఐదేళ్ల పాటు శ్రమించినట్లు ఆర్కియాలజిస్టులు తెలిపారు.

దిగ్గజ ఫైనాన్స్ కంపెనీ జేపీ మోర్గాన్ నేడు ప్రభుత్వ బాండ్లను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో చేర్చింది. దీంతో భారతీయ బాండ్లకు డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సూచీలో స్థానం కల్పించడంపై 2023 SEPలో జేపీ మోర్గాన్ తొలిసారిగా ప్రకటన చేసింది. అప్పటి నుంచి విదేశాలు మన బాండ్లపై దాదాపు $11బిలియన్లు వెచ్చించాయి. మరో 10నెలల్లో $25B వరకు భారత్‌కు రావొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది.
Sorry, no posts matched your criteria.