India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, కాజల్, SJ సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.

TG: తనకు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. MLC పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నానని చెప్పారు. రాజీనామా చేసి పల్లెలన్నీ తిరగనున్నట్లు తెలిపారు. BJP నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ‘ఇన్నాళ్లు పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పాటించా. కానీ ఈరోజు నాకు గౌరవం దక్కలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేడు జరగనున్న 5జీ వేలానికి టెలికాం సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్రానికి సంస్థలు చేసిన ఎర్నెస్ట్ డిపాజిట్ 2022తో పోలిస్తే 79-86% తక్కువ. జియో ₹3వేలకోట్లు, ఎయిర్‌టెల్ ₹1,050కోట్లు, Vi ₹300 కోట్లు కేటాయించాయి. ₹96,320cr విలువైన వేలంలో 13% (₹12,500) మాత్రమే సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు అంచనా.

కాలి కండరం పట్టేసిన అఫ్గానిస్థాన్ ప్లేయర్ గుల్బాదిన్ నాయబ్ నిమిషాల్లోనే తిరిగి పరిగెత్తడంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ డేవిడ్ స్మిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను గత 6 నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. ఈ గేమ్ ముగిసిన వెంటనే గుల్బాదిన్‌కు చికిత్స అందించిన వైద్యుడిని కలవబోతున్నా. అతను ప్రస్తుతం ప్రపంచంలోని 8వ అద్భుతం అని నేను అనుకుంటున్నా’ అని సెటైర్లు వేశారు.

T20WC సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణతో 3 దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కంగారూ ఫోబియా ఉన్న భారత్, ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్, ఆసీస్‌ను ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డ సౌతాఫ్రికా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కంగారూ జట్టు సెమీస్, ఫైనల్‌కి వస్తే కప్పు గెలవకుండా వెళ్లదనే నమ్మకమే ఇందుకు కారణం. కాగా సూపర్8లో బంగ్లాదేశ్‌పై గెలిచిన అఫ్గాన్ సెమీస్ చేరింది.

జిమ్ ట్రైనర్ అయిన భర్త తన బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ట్రైనర్ శరీరాకృతి చూసి ముగ్ధురాలై గతేడాది అతడిని వివాహం చేసుకుంది. తన బరువు కూడా తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది. అందుకు అతడూ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు కొంచెం కూడా బరువు తగ్గించలేకపోవడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అటు జిమ్ ట్రైనర్ మాత్రం భార్యతోనే ఉంటానని చెబుతున్నారు.

పార్లమెంటులో నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే కేంద్రమంత్రులు, ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు. స్పీకర్ పోస్టుకు ప్రతిపక్షాలూ పోటీకి సిద్ధపడుతుండటంతో ఈ నామినేషన్లు ఆసక్తికరంగా మారాయి. మాజీ స్పీకర్ ఓం బిర్లానే NDA మరోసారి బరిలో నిలపనున్నట్లు సమాచారం. కాగా నామినేషన్లపై రాజీ కుదిర్చేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలను సంప్రదిస్తున్నారు.

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీలోనే కొనసాగనున్నప్పటికీ MLC పదవి నుంచి మాత్రం తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారట. BRS MLA సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలతో చర్చల తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే ఛాన్సుంది. మరోవైపు ఆయన మద్దతుదారులు HYD గాంధీభవన్ దగ్గర ఆందోళనకు సిద్ధమయ్యారు.

T20 WC-2024లో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరింది. బంగ్లాపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో అద్భుత విజయంతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 116 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్ దాస్ (54*)ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టాయి. సూపర్ 8 గ్రూప్-1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. సెమీస్‌లో సౌతాఫ్రికా-అఫ్గానిస్థాన్, భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి.

AP: రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటిని బాగు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, అధికారులకు సూచించారు. గుంతలు పూడ్చేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, నిధులు సమకూర్చుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.