News June 26, 2024

నేటి నుంచి భారీ వర్షాలు

image

ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు తెలంగాణలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు.

News June 26, 2024

జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన

image

ప్రధాని నరేంద్ర మోదీ జులైలో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది కచన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమావేశాల్లోనూ మోదీ, పుతిన్ కలుసుకోనున్నట్లు సమాచారం.

News June 26, 2024

స్పీకర్ ఎన్నిక: ఎవరి బలం ఎంతంటే?

image

లోక్‌సభ స్పీకర్ పదవికి కావాల్సిన ఎంపీల మద్దతు NDA అభ్యర్థి ఓం బిర్లాకు ఉంది. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 240 ఓట్లు ఉన్నాయి. NDA భాగస్వామ్య పార్టీల ఓట్లు 53, వైసీపీ ఓట్లు 4తో కలిపి మొత్తం 297 ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్షమైన ఇండియా కూటమికి 233 మంది ఎంపీల మద్దతు ఉంది. రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం లోక్‌సభలో 542 మంది సభ్యులున్నారు. దీని ప్రకారం కావాల్సిన ఓట్లు 271.

News June 26, 2024

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక: NDAకు వైసీపీ మద్దతు

image

లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో NDA అభ్యర్థి ఓం బిర్లాకు YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ YV సుబ్బారెడ్డి ప్రకటించారు. ఓం బిర్లాకు మద్దతివ్వాలని NDA అగ్రనేతలు YCP అధినాయకత్వాన్ని కోరారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా NDAకు మద్దతిస్తున్నామన్నారు. స్పీకర్ పదవి కోసం TDP పట్టుబడితే మద్దతిస్తామన్న కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. అందుకే ఇండియా కూటమికి మద్దతివ్వట్లేదన్నారు.

News June 26, 2024

జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ?

image

TG: జులై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని HYD, RR, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. సుదర్శన్ రెడ్డి, మదన్‌మోహన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.

News June 26, 2024

నేడు ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

AP: ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెల్లడి కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఈ నెల 18న ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. WAY2NEWSలో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలను వేగంగా, సులభంగా చూసుకోవచ్చు.

News June 26, 2024

ప్రమాణం చేయని ఆ ఇద్దరు ఎంపీలు!

image

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్, తీవ్రవాది ఇంజినీర్ రషీద్ ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. వీరి ప్రమాణస్వీకారానికి అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా అమృత్‌పాల్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగర్‌ జైలులో ఉన్నారు. అలాగే రషీద్ ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

News June 26, 2024

నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

image

లోక్‌సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. NDA అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండియా కూటమి అభ్యర్థిగా కే సురేశ్ పోటీ పడుతున్నారు. కాగా తొలిసారిగా 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శాంతారామ్ (55)పై మౌలాంకర్ (394) విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ 344 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది.

News June 26, 2024

నేడు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26తో ప్రభాకర్ వీసా గడువు ముగియనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ ఇండియాలో అడుగు పెట్టగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అనారోగ్యం కారణంగా వీసా గడువును పెంచుకునేందుకు ప్రభాకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 26, 2024

ARCHER&JONES: చిన్ననాటి స్నేహితులు.. కానీ..!

image

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, యూఎస్ఏ ఆటగాడు ఆరోన్ జోన్స్ చిన్ననాటి స్నేహితులు. బార్బడోస్‌కు చెందిన వీరిద్దరూ స్కూల్ నుంచే ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడారు. వెస్టిండీస్‌ జట్టుకు ఆడాలని కలలు కన్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జట్టుకు ఇద్దరూ సెలక్ట్ కాలేదు. దీంతో ఆర్చర్ ఇంగ్లండ్‌కు, జోన్స్ అమెరికాకు వలస వెళ్లారు. తమ ఆట తీరుతో ఆయా జట్లకు ఎంపికై సత్తా చాటుతున్నారు.