News June 25, 2024

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని తీర్మానం

image

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సవరణలు సూచించాయి. కాగా గత ఏడాది కూడా కేరళ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

News June 25, 2024

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

AP: మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత DSC ప్రిపరేషన్‌కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

News June 25, 2024

EMERGENCY: ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ!

image

దేశ చరిత్రలోనే ఈ రోజు ఒక బ్లాక్ డే. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇందుకు కారణాలేమైనా దేశంలో పూర్తిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌లు చేసి జైళ్లలో పెట్టారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. దాదాపు రెండేళ్ల తర్వాత 1977 మార్చి 21న అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు.

News June 25, 2024

ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న భారత్..!

image

వన్డే WC-2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి 140 కోట్ల మంది భారతీయుల మనసులను గాయపరిచింది. అదే ఏడాది WTC ఫైనల్లోనూ మనకు టైటిల్ దక్కకుండా చేసింది. ఈ ఓటములకు తాజా టీ20 WCలో భారత్ బదులు తీర్చుకుంది. టీమ్ ఇండియా దెబ్బకు కంగారూల సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. AFGపై బంగ్లా గెలవాలని AUS కెప్టెన్ దేవుడిని తలచుకున్నారు.

News June 25, 2024

కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన అఫ్గాన్

image

టీ20 WC సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిస్తే AFG సెమీస్ చేరుతుంది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా ఎలిమినేట్ అవుతాయి. ఒకవేళ AFG ఇచ్చిన టార్గెట్‌ను బంగ్లాదేశ్ 13 ఓవర్లలోనే ఛేదిస్తే AUS, AFG కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. అలా జరిగితే BAN సెమీస్ చేరే అవకాశముంది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు SFకి వెళ్లే జట్టేదో కాసేపట్లో తేలనుంది.

News June 25, 2024

నేడు టెట్ ఫలితాలు విడుదల

image

AP: టెట్ ఫలితాలను ఇవాళ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.35 లక్షల మంది రాశారు. మార్చి 14నే ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెల్లడి కాలేదు.

News June 25, 2024

ఆప్ మంత్రి అతిశీ ఆస్పత్రికి తరలింపు

image

ఢిల్లీ నీటి సంక్షోభంపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష ఐదో రోజుకు చేరడంతో ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 3 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా హరియాణా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను వెంటనే విడుదల చేయాలని అతిశీ దీక్ష చేపట్టారు.

News June 25, 2024

నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు ఆయన అక్కడ పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను CBN కలవనున్నారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురులేకుండా పోయింది.

News June 25, 2024

అయోధ్య రామమందిరంలో నీటీ లీకేజీ

image

వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిరం పైకప్పు నుంచి గర్భ గుడిలోకి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కష్టంగా మారుతుందన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదని చెప్పారు. దీనిపై మందిర కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఆలయ పైకప్పుకు వాటర్ ప్రూఫింగ్ చేయిస్తామన్నారు. నీటి లీకేజీకి డిజైన్ సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు.

News June 25, 2024

ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతోన్న UPSC

image

పరీక్షల ప్రక్రియను పటిష్ఠపర్చేలా ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత CCTVలతో పర్యవేక్షణ వ్యవస్థను UPSC రూపొందించుకోనుంది. పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఆఫ్‌లైన్‌కి వెళ్లినా, అనుమానాస్పద కదలికలున్నా, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్నా ఈ సిస్టమ్ అధికారుల్ని అలర్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ IFSలతో సహా 14కీలక పరీక్షల్ని UPSC నిర్వహిస్తోంది. ఏటా దాదాపు 26లక్షల మంది పోటీ పడుతుంటారు.