News July 1, 2024

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు

image

TG: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికై <<13542490>>దీక్ష<<>> చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేని CM రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. రేపటి బంద్‌ను నిరుద్యోగులు విజయవంతం చేయాలి’ అని ఆయన కోరారు.

News July 1, 2024

నా దేశం, నా నేల కోసం పనిచేస్తా: పవన్ కళ్యాణ్

image

AP: CM, డిప్యూటీ CM కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నా. పదవుల కోసం కాదు. నా దేశం, నా నేల కోసం పనిచేస్తా. నా వైపు అవినీతి ఉండదు. ఓటు వేయని వారూ నన్ను ప్రశ్నించొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా. హంగులు, ఆర్భాటాలకు వెళ్లను. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు అనుకునేలా పాలన ఉంటుంది’ అని జనసేనాని స్పష్టం చేశారు.

News July 1, 2024

AP టీడీపీ ఆఫీసులో పోలీసుల విచారణ

image

AP: మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై 2021లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

News July 1, 2024

రోహిత్ రిటైర్మెంట్‌పై రితిక ఎమోషనల్ పోస్ట్

image

టీ20 WC విజయం రోహిత్‌కు ఎంత విలువైందో తనకు తెలుసని ఆయన భార్య రితిక అన్నారు. దీని కోసం కొన్నినెలల పాటు హిట్ మ్యాన్ కఠిన సమయం గడిపారని పేర్కొన్నారు. అన్నింటిని అధిగమిస్తూ తన కలను నెరవేర్చుకోవడం స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. ఆటను ప్రేమించే వ్యక్తిగా రోహిత్ టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉందన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన సొంతం అయినందుకు గర్విస్తున్నట్లు ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు.

News July 1, 2024

నేటి నుంచి కొత్త రూల్స్

image

SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను ICICI రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అయితే చెక్/క్యాష్ పికప్, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్, డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్వెస్ట్‌కు ఛార్జీలను తొలగించింది.

News July 1, 2024

గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై రేవంత్ చర్చిస్తారని సమాచారం. మరోవైపు నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి.

News July 1, 2024

ప్రత్యేక హోదాపై CBN ఎందుకు నోరు విప్పడం లేదు: షర్మిల

image

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని APCC చీఫ్ షర్మిల కోరారు. ‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదు. కేంద్రంలో కింగ్ మేకర్‌గా ఉన్నా హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గం’ అని ట్వీట్ చేశారు.

News July 1, 2024

అందుబాటులోకి ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’

image

ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులను రక్షించి వాటికి పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ‘టాటా ట్రస్ట్ స్మాల్ యానిమల్ హాస్పిటల్’ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకూ ఇందులో ట్రయల్స్ మాత్రమే నిర్వహించగా ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయిలో జంతువుల పరిరక్షణకు అందుబాటులోకి తెచ్చినట్లు రతన్ టాటా తెలిపారు. అపాయింట్‌మెంట్, అత్యవసర సహాయం కోసం <>వెబ్‌సైట్‌<<>> సంప్రదించాలని సూచించారు.

News July 1, 2024

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
✒ ఈ నెల 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
✒ 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
✒ 13న ఆప్షన్ల మార్పునకు అవకాశం
✒ 16న సీట్ల కేటాయింపు
✒ 17 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
✒ 19 నుంచి తరగతులు ప్రారంభం

News July 1, 2024

హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను CBI అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను CBI అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3రోజుల రిమాండ్ విధించింది. విచారణకు మరో 14 రోజులు కావాలని CBI కోరడంతో జుడీషియల్ కస్టడీని జులై 12 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.