India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

EPS1995లో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన 6నెలల్లోనే ఉద్యోగులు EPS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు ‘టేబుల్ D’ని సవరించింది. ఈ మార్పులతో 23లక్షల మందికిపైగా ప్రయోజనం పొందనున్నారు. 10ఏళ్ల సర్వీస్ ప్రాతిపదికన లెక్కించే బెనిఫిట్స్‌ను ఇకపై పని చేసిన నెలల ఆధారంగా లెక్కిస్తారు. కానీ ఈ స్కీమ్‌లో 10ఏళ్లకు ముందే విత్‌డ్రా చేసుకుంటే బెనిఫిట్స్ అందవు.

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 400కుపైగా పాయింట్లు లాభపడి 79,450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 24,136 వద్ద కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్ లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. నిఫ్టీలో విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

T20 వరల్డ్ కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంపై ఆస్ట్రేలియా మీడియా మినహా అన్ని దేశాలు రోహిత్ సేన ఘనతను కొనియాడాయి. ‘టీమ్ ఇండియాకు T20WCలో అన్నీ అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు కప్పు గెలిచింది’ అన్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ రాసుకొచ్చింది. సూపర్-8లో ఆసీస్‌పై భారత్ గెలవడాన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కసు వెళ్లగక్కిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఒకప్పుడు వీటిని కొనుగోలు చేసిన 1300 కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. పలు కంపెనీలకు ఇప్పటికే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చినట్లు సమాచారం. రాజకీయ పార్టీలకు డొనేట్ చేసిన మొత్తానికి సంబంధించి సంస్థలను ప్రశ్నించాయట. కాగా దీనిపై పలు సంస్థలు ఆర్థిక శాఖను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన ఖర్చుపై మినహాయింపు ఇవ్వాలని కోరాయట.

గాడ్సేను RSS రెచ్చగొట్టి గాంధీ హత్యకు పురిగొల్పిందన్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. RSS భావజాలం దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కఢ్.. దేశం కోసం పనిచేసిన సంస్థను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఖర్గే కామెంట్స్‌ను రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

టెర్రర్ ఫండింగ్ కేసులో జైలులో ఉన్న ఇండిపెండెంట్ MP అబ్దుల్ రషీద్ ఈ నెల 5న పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసేందుకు NIA అనుమతించింది. మీడియాతో మాట్లాడొద్దని షరతులు విధించింది. ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా కోర్టు రేపు మధ్యంతర బెయిల్ ఇవ్వనుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చారనే ఆరోపణలతో రషీద్‌ను NIA 2019లో అరెస్టు చేసింది. బారాముల్లా స్థానంలో ఇండిపెండెంట్‌గా గెలిచారు.

TG: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికై <<13542490>>దీక్ష<<>> చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలేని CM రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. రేపటి బంద్‌ను నిరుద్యోగులు విజయవంతం చేయాలి’ అని ఆయన కోరారు.

AP: CM, డిప్యూటీ CM కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నా. పదవుల కోసం కాదు. నా దేశం, నా నేల కోసం పనిచేస్తా. నా వైపు అవినీతి ఉండదు. ఓటు వేయని వారూ నన్ను ప్రశ్నించొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా. హంగులు, ఆర్భాటాలకు వెళ్లను. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు అనుకునేలా పాలన ఉంటుంది’ అని జనసేనాని స్పష్టం చేశారు.

AP: మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై 2021లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైనా పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

టీ20 WC విజయం రోహిత్‌కు ఎంత విలువైందో తనకు తెలుసని ఆయన భార్య రితిక అన్నారు. దీని కోసం కొన్నినెలల పాటు హిట్ మ్యాన్ కఠిన సమయం గడిపారని పేర్కొన్నారు. అన్నింటిని అధిగమిస్తూ తన కలను నెరవేర్చుకోవడం స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. ఆటను ప్రేమించే వ్యక్తిగా రోహిత్ టీ20లకు వీడ్కోలు పలకడం బాధగా ఉందన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన సొంతం అయినందుకు గర్విస్తున్నట్లు ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.