India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కుటుంబ కలహాలతో నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్‌పేట బతుకమ్మ కుంటలోని పోచమ్మ బస్తీలో శ్రీనిధి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న జస్టిస్ మణికంఠ(36) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యతో మనస్పర్థల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ BJPలో చేరినట్లు ప్రకటించారు. కాసేపటి క్రితం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో కంగనాకు చోటు దక్కింది. దీనిపై స్పందించిన కంగనా BJPకి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని, ఈరోజు తన జన్మస్థలం మండి(హిమాచల్ ప్రదేశ్) అభ్యర్థిగా ప్రకటించిందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించేందుకు గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.

సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే వరుణ్ గాంధీకి BJP అధిష్ఠానం మొండి చేయి చూపించింది. UPలోని పిలిభిత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న వరుణ్‌కు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాదను బరిలో దింపనున్నట్లు ప్రకటించింది. కాగా.. వరుణ్ తల్లి మేనకా గాంధీకి సుల్తాన్‌పూర్ నుంచి అవకాశం కల్పించింది.

AP: టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన జనసేన మూడింటిని పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఆయనపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ పోటీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ ఆయన పేరును చేర్చింది. 2019లో సురేంద్రన్ పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామ ప్రజలు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. అది కూడా మామూలుగా కాదండోయ్.. పడుకుంటే కుంభకర్ణులే. ఒక్కసారి పడుకుంటే కనీసం నెలపాటు నిద్రిస్తారు. పెద్ద డీజే సౌండ్ పెట్టి లేపినా లేవరు. నిద్ర లేచాక వారు ఎంతసేపు పడుకున్నారో కూడా తెలియదట. దీనికి కారణం కలుషిత నీరు తాగటమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రామ సమీపంలో యురేనియం గనులు ఉండటంతో నీటిలో కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఇలా జరుగుతోందట.

బీజేపీ 111 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నవీన్ జిందాల్(కురుక్షేత్ర), కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు చోటు కల్పించింది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్(పాట్నా సాహిబ్), గిరిరాజ్ సింగ్(బెగుసరాయ), ధర్మేంద్ర ప్రధాన్(సంబల్‌పూర్)తో పాటు మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్), హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్(దుమకా) జాబితాలో ఉన్నారు.

TG: ఇటీవల BJPలో చేరిన జలగం వెంకటరావుకు షాక్ తగిలింది. ఖమ్మం నుంచి ఎంపీ సీటు ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. తాజా జాబితాలో ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పేరును బీజేపీ ప్రకటించింది. టికెట్ ఆశించి బీజేపీలో చేరిన వెంకట్ రావు ముందు నుంచి ఖమ్మం స్థానం తనదేనని ధీమాతో ఉన్నారు. కొత్తగూడెంకు చెందిన వ్యాపారవేత్త వినోద్ రావుకు ఈ స్థానంలో టికెట్ ఇవ్వడంతో జలగం పరిస్థితి అయోమయంగా మారింది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా.. మనిషి మరింత ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. వయాగ్రాలో ఉండే పవర్‌ఫుల్ కెమికల్ సిల్డెనాఫిల్ ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇది మరణం సంభవించే ప్రమాదాన్ని 15%, అల్జీమర్స్ రిస్క్‌ని 18% తగ్గిస్తుందట. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. కాగా వైద్యుల సూచనలతోనే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి.

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో గుజరాత్ జట్టు 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. సాయి సుదర్శన్(45), గిల్(31) మాత్రమే రాణించారు. ముంబై జట్టులో బుమ్రా 3, కోయెట్జీ 2, చావ్లా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
Sorry, no posts matched your criteria.