News February 22, 2026

నట్టింట్లో తల చిక్కు తీయకండి

image

ఇంటి మధ్య భాగాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. అక్కడ తల దువ్వితే వెంట్రుకలు రాలి ఇంట్లోనే పడతాయి. ఇల్లంతా వ్యాపిస్తాయి. తినే ఆహారంలోనూ పడే ఛాన్సుంది. వస్తువులపై పడే అవకాశం కూడా ఉంది. ఇది అశుభ్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి నివసించే చోట ఇలా చేయకూడదు. ఇది దారిద్రానికి హేతువని పండితులు చెబుతారు. విడిగా ఒక గదిలో/బాత్రూంలో తల దువ్వుకోవాలి. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.

News February 22, 2026

సూపర్-8: ‘సూర్య’సేన జోరు కొనసాగేనా?

image

T20 WC సూపర్-8లో నేడు 2 కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఇంగ్లండ్, శ్రీలంక తలపడతాయి. అనంతరం అహ్మదాబాద్ వేదికగా 7pmకు భారత్, సౌతాఫ్రికా మధ్య పోరు జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లో గెలిచిన సూర్య సేన.. అదే ఊపుతో సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ గడ్డపై టీమ్ఇండియా బ్యాటర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 22, 2026

నాసా మూన్ మిషన్ వాయిదా!

image

చంద్రుడిపైకి మనుషులను పంపే నాసా ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం వాయిదా పడినట్లే! మార్చి 6న జరగాల్సిన ఈ మిషన్‌లో కొత్తగా హీలియం లీకేజీ తలెత్తింది. దీంతో భారీ SLS రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ నుంచి తిరిగి హ్యాంగర్‌కు తరలించనున్నారు. ఇంధన ట్యాంకుల ప్రెజర్‌కు అవసరమైన హీలియం ఫ్లోలో అంతరాయమే దీనికి కారణం. టెక్నికల్ ఇష్యూస్‌ను సరిదిద్దేందుకు టైమ్ పడుతుండటంతో మార్చిలో ఈ ప్రయోగం జరిగే అవకాశం లేదని నాసా తెలిపింది.

News February 22, 2026

వర్షం దెబ్బ.. పాకిస్థాన్ సెమీస్ లెక్కలు తలకిందులు!

image

కొలంబోలో శనివారం పాక్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. దీంతో పాక్ సెమీస్ చేరాలంటే తర్వాతి 2 మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్‌తో సల్మాన్ అలీ ఆఘా సేన సెమీస్ పోరు క్లిష్టంగా మారింది.

News February 22, 2026

శగుణం అంటే తెలుసా?

image

మంచి, శుభప్రదాన్నే శగుణం అంటారు. ఇది సంస్కృత పదం. శుభకార్యాలప్పుడు దైవిక ఆశీస్సులు కోరుతూ బహుమతి రూపేణా శగుణం ఇస్తారు. ముఖ్యంగా వివాహ వేడుకలలో మనం దీన్ని చూడవచ్చు. పెళ్లికి ముందు జరిగే పలు వేడుకల్లో వధువు, వరుడి కుటుంబాలు నగలు, బట్టలు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ వంటివి శగుణంగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇది కేవలం వస్తు మార్పిడి మాత్రమే కాదు! రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ఖరారు చేసే పవిత్రమైన ప్రక్రియ.

News February 22, 2026

65-10-10-15 ఫార్ములాతో మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్

image

మార్కెట్ అనిశ్చితిని తట్టుకోవడానికి 65-10-10-15 అనే మల్టీ-అసెట్ ఫార్ములా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 65% ఈక్విటీ, 15% డెట్, తలా 10% బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలి. ‘బోరింగ్ థాలీ’గా పిలిచే ఈ విధానం వల్ల ఒక రంగం నష్టాల్లో ఉన్నా మరోటి లాభాలతో బ్యాలెన్స్ చేస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ వెనక పరిగెత్తకుండా పెట్టుబడులను ఇలా విభిన్నంగా పంచుకుంటే రిస్క్ తగ్గి దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంది.

News February 22, 2026

65-10-10-15 ఫార్ములాతో మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్

image

మార్కెట్ అనిశ్చితిని తట్టుకోవడానికి 65-10-10-15 అనే మల్టీ-అసెట్ ఫార్ములా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 65% ఈక్విటీ, 15% డెట్, తలా 10% బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలి. ‘బోరింగ్ థాలీ’గా పిలిచే ఈ విధానం వల్ల ఒక రంగం నష్టాల్లో ఉన్నా మరోటి లాభాలతో బ్యాలెన్స్ చేస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ వెనక పరిగెత్తకుండా పెట్టుబడులను ఇలా విభిన్నంగా పంచుకుంటే రిస్క్ తగ్గి దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంది.

News February 22, 2026

నేడు దేవాదుల ప్రాజెక్టుకు CM రేవంత్

image

TG: CM రేవంత్ రెడ్డి నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్, SP, అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటి సరఫరా సామర్థ్యం, పెండింగ్ పనులు, నిర్వహణపై కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.

News February 22, 2026

అణు బాంబు ఆపకపోతే.. ఖమేనీ ఖతం? ట్రంప్ ప్లాన్!

image

ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అణు బాంబు తయారీ ప్రయత్నాలను మానుకోకపోతే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మొజ్తాబాతో పాటు కీలక మత పెద్దలను అంతం చేసేందుకు ఆదేశించే అవకాశం ఉందని Axios నివేదిక పేర్కొంది. చర్చలకు ఇరాన్ అంగీకరించకపోతే పెంటగాన్ అన్ని రకాల సైనిక ఆప్షన్లను సిద్ధం చేసినట్లు సమాచారం.

News February 22, 2026

కవిత పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’?

image

TG: BRS నుంచి సస్పెండ్ అయిన మాజీ MLC కవిత తమ కొత్త పార్టీ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తమ సంస్థ ‘తెలంగాణ జాగృతి’ పేరు కలిసొచ్చేలా ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా పార్టీ పేరును నిర్ణయించినట్లు తెలుస్తోంది. మే నెలలో అధికారికంగా పేరు ప్రకటించి.. జూన్‌లో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి.