India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్న <<16050508>>రాణా<<>>ను కట్టుదిట్టమైన భద్రత మధ్య NIA కార్యాలయానికి తరలించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన పాలెం విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌లోకి అతడిని షిఫ్ట్ చేస్తారు. సాయుధ బలగాలు, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణతో ట్రాఫిక్ క్లియర్ రూట్‌లో కాన్వాయ్ వెళ్తుంది. ఏ రకమైన దాడినైనా తట్టుకునే ‘మార్క్స్ మ్యాన్’ వాహనాన్ని దీనికి స్టాండ్‌బైగా ఉంచారు.
TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉండటంతో దుబాయ్ నుంచి వచ్చిన ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే తల్లి అంత్యక్రియల కోసం వచ్చానని చెప్పడంతో వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అంత్యక్రియల తర్వాత ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. కొద్ది నెలలుగా షకీల్ దుబాయ్‌లో ఉంటున్నారు.
AP: నెల్లూరు జిల్లాలో మహిళ దారుణ హత్య సంచలనం రేపుతోంది. ఆమెను వివస్త్రను చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ కొట్టిచంపినట్లు ప్రచారం జరుగుతోంది. కట్నం కోసం హత్య చేసి, ఆత్మహత్య చేసుకుందంటూ డ్రామా ఆడినట్లు సమాచారం. మహిళ మృతదేహన్ని నెల్లూరు GGHకు తరలించి, పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామలు, ఆడపడుచు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం సన్ పిక్చర్ ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో హీరో రెమ్యునరేషన్ రూ.175 కోట్లు, డైరెక్టర్‌కు రూ.125 కోట్లు వెచ్చిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విడాకుల వార్తలను మిషెల్ ఒబామా ఖండించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ ప్రచారం మహిళల స్వేచ్ఛపై దాడేనని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఒబామాతో కలిసి మిషెల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం జోరందుకుంది. అయితే ఆ కార్యక్రమాలకు వెళ్లడమనేది తన వ్యక్తిగత విషయమే తప్ప వైవాహిక బంధంలో ఏర్పడిన వివాదాల వల్ల కాదన్నారు. ఇతరులనుకునేది చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.
అంగారక గ్రహంపై నివాసానికి పోలిష్ అకాడమీ శాస్త్రవేత్త ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి అని సూచించారు. తద్వారా అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మార్స్‌పై CO2 అధికంగా ఉండటంతో దానిపై మనుషులు జీవించడం సాధ్యపడదు. ఊర్ట్ క్లౌడ్‌లోని ఓ మంచు గ్రహశకలం అంగారకుని దగ్గరికి చేరుకోవాలంటే 15వేల సంవత్సరాలు పడుతుందట.
సోషల్ మీడియాలో ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, అనుకూలంగా పోస్టులు పెట్టినా ఇకపై US వీసా రాదు. హమాస్, పాలస్తీనియన్, ఇస్లామిక్ జిహాద్, లెబనాన్, హెజ్‌బొల్లా, హౌతీ వంటి గ్రూపులకు మద్దతిచ్చినట్లు తేలితే వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరు చేయబోమని US స్పష్టం చేసింది. ఉగ్రవాద సానుభూతిపరులకు తమ దేశంలో స్థానం లేదని, అలాంటి వారికి గేట్లు మూసుకుపోయినట్లేనని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ-2’ షూటింగ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో షూటింగ్ సజావుగా జరగట్లేదనే రూమర్స్ ప్రస్తుతం టీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో దీనిపై సినీవర్గాలు స్పందించాయి. వీటిలో ఎలాంటి నిజం లేదని, షూట్ సజావుగా సాగుతోందని వెల్లడించాయి. వీరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. bse.ap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. నిన్నటితో బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ముగిశాయి. తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, 17న రెండో సెషన్ రిజల్ట్స్ రానున్నాయి. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మే 18న ఈ పరీక్ష జరగనుంది.
Sorry, no posts matched your criteria.