India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.380 పెరిగి రూ.72,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 పెరిగి 66,100గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తాజాగా కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.89,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

TG: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భువనగిరి ఎంపీ స్థానంపై రివ్యూ చేయనున్నారు. కాసేపట్లో ఆయన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు. దీనికి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితర నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఆడవారికంటే మగవారే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు ఏడాదికి సగటున 728 అబద్ధాలు చెబితే.. పురుషులు ఏకంగా 1,092 అబద్ధాలు ఆడుతున్నారట. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో కంటే నేరుగా కలిసినప్పుడు మరిన్ని అబద్ధాలు చెబుతున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘జీవితంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అని పోస్ట్ చేశారు. దీనికి నవ్వుతున్న ఫొటోను యాడ్ చేశారు. ఇటీవల పలువురు నేతలు పార్టీ మారడం, కవిత అరెస్టు బీఆర్ఎస్‌పై ప్రభావం చూపాయి. ఈ క్రమంలో KTR చేసిన ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో అని చర్చించుకుంటున్నారు.

AP: బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశారు. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి.. టీచర్ అవాక్కయ్యారు. వెంటనే ఆన్సర్ షీట్‌ను ఉన్నతాధికారులకు చూపించారు. అయితే, ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోదరుడు (కజిన్) విరాట్ రాజు హీరోగా ‘గౌడ్ సాబ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. వేంగి మ్యూజిక్ అందించనున్నారు. మూవీలో నటించే నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు.

AP: జనసేన మాజీ నేత పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేశ్ జనసేన తరఫున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ఆ సీటు కేటాయించారు. దీంతో అప్పటినుంచి ఆయన జనసేనకు దూరంగా ఉంటూ ఇటీవల రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీ గూటికి చేరారు.

రహస్యంగా పెళ్లి చేసుకోవడంపై హీరోయిన్ తాప్సీ ఎట్టకేలకు స్పందించారు. ‘నా వివాహాన్ని ప్రైవేటుగా చేసుకోవాలనుకున్నా కానీ రహస్యంగా కాదు’ అని స్పష్టం చేశారు. తన వైవాహిక జీవితాన్ని పబ్లిక్‌లో పెట్టొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ఫొటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో పెట్టలేదని తాప్సీ వివరించారు. కాగా కొన్నాళ్లుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌తో ప్రేమలో ఉన్న ఆమె.. మార్చి 22న ఉదయ్‌పుర్‌లో వివాహం చేసుకున్నారు.

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ విజయానికి స్క్రిప్ట్ చాలా ముఖ్యమని చెప్పారు. కంటెంట్‌ను ఎంత స్ట్రాంగ్‌గా డెలివరీ చేస్తే అభిమానులు అంత బాగా ఆదరిస్తారన్నారు. నటి, హీరోయిన్ అనేవి డిఫరెంట్ రోల్స్ అని తెలిపారు. హీరోయిన్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని.. నటికి ఎలాంటి పరిధి ఉండదన్నారు. ఏ క్యారెక్టర్ అయినా 100శాతం ఎఫెర్ట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ జట్లు ఇదే భావనలో ఉన్నట్లు సమాచారం. కానీ ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని గతంలో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తారు. ఈ సారి 2025లో జరగనుంది. ఇందులో దాదాపు 1000 మందికిపైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.