News April 7, 2024

రెండోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు

image

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడిగా రెండోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. 26 మంది కమిటీ సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎన్నికలు లేకుండానే ఆయన రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 7, 2024

ఉగాది పంచాంగం: ఈ రాశి వారికి కనకవర్షం!

image

ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వీరికి ఆదాయం-14 ఉండగా వ్యయం-02 మాత్రమే ఉంది. క్రోధి నామ సంవత్సరంలో ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి కర్కాటక రాశి వారికి పుష్కలంగా ఉంటాయట. అయితే వీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలని సూచిస్తున్నారు.

News April 7, 2024

సర్వేపల్లి: కాకాణి హ్యాట్రిక్కా? సోమిరెడ్డి గెలుపా?

image

AP: ఆంధ్రా స్టేట్ రెండో CM బెజవాడ గోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఇక్కడ TDP గెలిచి 25 ఏళ్లయింది. 1999లో చివరిసారిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించారు. వరుసగా 4సార్లు ఓడిన ఆయన మరోసారి బరిలో దిగుతున్నారు. 2014, 19లో గెలిచిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హ్యాట్రిక్‌పై ధీమాగా ఉన్నారు. ఆ సెగ్మెంట్‌లో 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP గెలిచింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 7, 2024

ఇంటింటి ప్రచారానికీ అనుమతి ఏంటి?.. ఈసీకి టీడీపీ లేఖ

image

AP: రాష్ట్రంలో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ సీఈవో ముకేశ్ ఇచ్చిన ఆదేశాలపై TDP అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేత కనకమేడల రవీంద్ర ECకి లేఖ రాశారు. ప్రతి రోజూ, ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పుడూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేశారు.

News April 7, 2024

సైబర్ క్రైమ్‌కు ‘ఫ్యామిలీ స్టార్’ బృందం ఫిర్యాదు

image

తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెట్టింట తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరింది. సినిమాపై నెగటివ్ ట్రోలింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా వారికి సమర్పించినట్లు సమాచారం. మరోవైపు సినిమా నిర్మాత దిల్ రాజు సైతం ప్రెస్‌మీట్‌లో ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News April 7, 2024

MPC, BiPC విద్యార్థులకు BIG ALERT

image

TG: EAPCET-2024 దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లు సరిచేసుకునే అవకాశాన్ని JNTUH కల్పిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు వెబ్‌సైటులో కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. అన్ని వివరాలు ఎడిట్ చేశాక.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అటు రూ.250 జరిమానాతో APR 9వ తేదీ వరకు, రూ.5000 ఫైన్‌తో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

News April 7, 2024

GTvsLSG: గుజరాత్ టార్గెట్ 164 రన్స్

image

GTతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ 58, కేఎల్ రాహుల్ 33, నికోలస్ పూరన్ 32*, ఆయుష్ బదోని 20 రన్స్‌తో రాణించారు. ఉమేశ్ యాదవ్, దర్శన్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

News April 7, 2024

మోదీ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారు: జైరాం రమేశ్

image

పదేళ్లుగా ఎలాంటి హామీలూ నెరవేర్చని ప్రధాని మోదీ.. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. మోదీ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ‘పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారంటీ’ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని పేర్కొన్నారు.

News April 7, 2024

IPL: T20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు

image

ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై సరికొత్త రికార్డు సృష్టించింది. T20 మ్యాచ్‌లో ఆటగాళ్లెవరూ హాఫ్ సెంచరీ చేయకుండా అత్యధిక స్కోర్(234) చేసిన జట్టుగా ఘనత సాధించింది. రోహిత్ 49, టిమ్ డేవిడ్ 45*, ఇషాన్ 42, హార్దిక్ 39, షెఫర్డ్ 39* రన్స్ చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ T20 బ్లాస్ట్ టోర్నీ-2018లో సొమర్‌సెట్ జట్టు చేసిన 226 పరుగుల రికార్డును(ఒక్క ఫిఫ్టీ కూడా లేకుండా) ముంబై బ్రేక్ చేసింది.

News April 7, 2024

కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత?

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత పేరును KCR ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే మరోసారి ఈ టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ MLA లాస్య నందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్రీ గణేశ్ పేరును ప్రకటించింది.