News March 31, 2024

అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో నగదు జమ చేసింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

News March 31, 2024

అవ్వాతాతలపై కసి తీర్చుకున్న చంద్రబాబు: వైసీపీ

image

AP: వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడంపై EC <<12956311>>ఆంక్షలు<<>> విధించడానికి చంద్రబాబే కారణమని వైసీపీ Xలో విమర్శించింది. ‘అవ్వాతాతలపై CBN కసి తీర్చుకున్నారు. వారికి ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పేదల నోటి దగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు. నాడు ఇంగ్లిష్ మీడియం విద్యను, ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీనికి త్వరలోనే TDP మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఫైరయ్యింది.

News March 31, 2024

IPLలో నేడు డబుల్ ధమాకా

image

IPLలో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3:30కి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30కి విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. GT, SRH ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్కో విజయం నమోదు చేయగా, చెన్నై ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇప్పటికే 2 మ్యాచుల్లో ఓడిన DC నేటి మ్యాచులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.

News March 31, 2024

ఎండుతున్న చెరువులు

image

TG: రాష్ట్రంలో 50శాతం చెరువులు ఎండిపోయాయి. గతేడాది నుంచి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పాటు ప్రాజెక్టుల్లో నీరు లేక కాలువలకు వదలడంలేదు. మరో 10 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మరిన్ని చెరువులు అడుగంటనున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీరు రావడంలేదు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు గ్రాసం కొరత ఏర్పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News March 31, 2024

వేల మంది ప్రాణాలు కాపాడిన లోకో‌పైలట్

image

లోకోపైలట్ అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై హైవోల్టేజ్ విద్యుత్ లైన్ పడి ఉండటాన్ని గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. కర్ణాటకలోని తుమూకూరు(D)లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ హాసన్‌కు బయలుదేరగా కుణిగల్ సమీపంలోని ట్రాక్‌పై విద్యుత్ తీగ పడి ఉంది. లోకో‌పైలట్ గమనించి రైలుని నిలిపివేశాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

News March 31, 2024

2 నెలలు వేసవి సెలవులు.. నేటి నుంచే

image

TG: ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అటు ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌లో వెలువడే అవకాశాలున్నాయి.

News March 31, 2024

నేడు ఆ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగు నీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండా, సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించి, అనంతరం నల్గొండ జిల్లా నిడమనూరులో రైతులతో మాట్లాడతారు.

News March 31, 2024

మొదలైన రిటైర్మెంట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021లో అప్పటి సర్కార్ ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచింది. దీంతో అప్పట్లో రిటైర్ అవ్వాల్సిన వారి ఉద్యోగ విరమణ మరో మూడేళ్లు పెరిగింది. ఆ గడువు మార్చి 31తో ముగుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సుమారు 336 మంది ఉద్యోగులు నిన్నే విరమణ పొందారు.

News March 31, 2024

ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా?

image

భారతీయులకు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొందరు నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు వెంటనే కొత్త కార్డుకు అప్లై చేసుకోవాలి. retrieve-eid-uid వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News March 31, 2024

హౌస్ అలవెన్స్ కోసం ఇతరుల పాన్‌కార్డ్ వాడేస్తున్నారు!

image

అద్దె ఇంట్లో ఉంటున్న వారు హౌస్ అలవెన్స్ కోసం రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మోసానికి తెరతీసినట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్ కార్డుల్ని అనధికారికంగా వాడేస్తున్నారట. సదరు పాన్‌కార్డుదారుడికీ ఆ విషయం తెలీదు. ఇలా అద్దెకు లేకపోయినా రెంట్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న 8-10వేల కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.