News April 5, 2024

వద్దనుకున్నవాడే.. పెద్ద దిక్కయ్యాడు

image

గుజరాత్‌‌తో మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్‌ని వేలంలో PBKS వద్దనుకుంది. వేరొక శశాంక్‌ను కొనబోయి.. ఇతడిని రూ.20లక్షలకు కొనేసింది. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. కాగా.. ‘సరైన శశాంక్‌ సింగే జట్టులోకి వచ్చాడు’ అని అప్పుడు PBKS యాజమాన్యం కవర్ చేసుకుంది. అయితే.. అలా వద్దనుకున్న ఆటగాడే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారి కష్టాల్లో ఉన్న జట్టును 29బంతుల్లో 61రన్స్‌తో రాణించి గెలిపించారు.

News April 5, 2024

నేడు బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు

image

TG: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. కరవు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని దీక్షకు దిగనుంది. క్వింటా వడ్లకు రూ.500 బోనస్, రూ.2 లక్షల లోపు రుణమాఫీ, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీక్ష చేపట్టనుంది.

News April 5, 2024

PLEASE CHECK.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. మొత్తం 4,61,806 మంది ఓటర్లను గుర్తించగా.. వీరిలో పురుషులు 2.87 లక్షల మంది, మహిళలు 1.74 లక్షల మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,606 మంది, అత్యల్పంగా సిద్దిపేటలో 4,671 మంది ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోండి.

News April 5, 2024

వైసీపీ ప్రచారానికి దూరంగా అలీ.. ప్లాన్స్ ఏంటి?

image

AP: గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు నటుడు అలీ. ఆయనకు అధిష్ఠానం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవినిచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఈ ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం నుంచి అలీ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించడం లేదు.

News April 5, 2024

మోదీ పాలనలో వారి అరెస్టులు ఇంకా పెరిగాయి: కమల్ హాసన్

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులం తన శత్రువని, తన జీవితంలో కులానికి చోటు లేదన్నారు. అట్టడుగు స్థాయిలో ఇంకా ఎందరు ఉన్నారో తెలుసుకునేందుకు కుల గణన చేపట్టాలన్నారు. తమిళనాడులో మత్స్యకారుల అరెస్టులు ఆగిపోలేదని, పదేళ్ల మోదీ పాలనలో ఇంకా పెరిగాయని విమర్శించారు.

News April 5, 2024

సామాన్యుడికి ఒకలా.. స్టేడియానికి ఒకలా!

image

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న SRHvsCSK మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు ఎలక్ట్రిసిటీ అధికారులు ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ నిలిపివేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుడు ఒక్క నెల చెల్లించకపోతే ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేసేవారు. బిజినెస్ భారీగా ఉండే స్టేడియం రూ.1.67కోట్ల బిల్లు కట్టనంత వరకూ ఏం చేశారు?’ అని ప్రశ్నిస్తున్నారు. IPL స్టార్టింగ్‌లోనే బిల్లుల వసూలుపై దృష్టి పెట్టాల్సిందని సూచిస్తున్నారు.

News April 5, 2024

ఇవాళ్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా PCC చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్‌లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, ఆట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.

News April 5, 2024

UN నాకు చెప్పాల్సిన అవసరం లేదు: జైశంకర్

image

గతవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి(UN) స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.

News April 5, 2024

సీపీఐ పోటీ చేసే స్థానాలివే

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు విశాఖ పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఈ మేరకు సీట్ల ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.

News April 5, 2024

‘భీమిలి’లో సిసలైన పోరు

image

AP: విశాఖ(D) భీమిలిలో ఎన్నికల హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ఇద్దరు ఓటమెరుగని నేతలు గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్(YCP) ఇక్కడ ఢీకొంటున్నారు. పార్టీ, నియోజకవర్గం మారినా గెలిచే రాజకీయ చతురులు వీరు. భీమిలిలో 2009లో అవంతి(PRP), 14లో గంటా(TDP), 19లో అవంతి(YCP) గెలుపొందారు. ఈసారి ఇద్దరు బలమైన కాపు నేతలు భీమిలి బరిలో ఉండటంతో లక్షకు పైగా ఉన్న కాపు ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది.
<<-se>>#ELECTIONS2024<<>>