India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పవర్ ప్లేలో హైదరాబాద్‌ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. SRH బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. ఇది నల్లరేగడి పిచ్ కావడంతో నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయింది. మేము ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం. అయినా ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకొచ్చాం’ అని రుతురాజ్ చెప్పారు.

AP: కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షలు మాత్రమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని, భూమిని చదును చేసే పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. రాజమండ్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు పరిధిలోని జనసేన, టీడీపీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తామన్నారు.

TG: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌కు కోర్టుని CBI గడువు కోరింది. ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత న్యాయవాదిని సీబీఐ కోరింది. మరోవైపు కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కౌంటర్ దాఖలుకు ఈ నెల 10 వరకు గడువిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

TG: అధికారం లేకపోతే కేసీఆర్ కుటుంబం బతకలేకపోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు సంకెళ్లు వేశారని అన్నారు. గతంలో వర్షాలకు రైతులు నష్టపోతే రూ.10 వేలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చాలా జిల్లాల్లో రైతులు నష్టపోయారని.. ఆ ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు సంధించారు.

దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. ఓటర్లను తప్పుదోవపట్టించేందుకు చైనా కుట్రపన్నుతోందని తెలిపింది. భారత్ సహా ఈ ఏడాది జరగనున్న US, సౌత్‌కొరియా తదితర దేశాల ఎన్నికలనూ ప్రభావితం చేసేందుకు చైనా సైబర్ గ్రూప్స్ ప్లాన్ చేస్తున్నాయని తెలిపింది. ఏఐతో రూపొందించిన ఫేక్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అనుకూల ఫలితాలు పొందేందుకు డ్రాగన్ ప్లాన్ చేస్తోందట.

టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో CSK ఆల్‌రౌండర్ శివం దూబే ఉండాలని సిక్సర్ల కింగ్ యువరాజ్ అన్నారు. అతడు సునాయాసంగా సిక్సర్లు కొడుతున్నాడని, జట్టులో గేమ్ ఛేంజర్ అవుతాడని యువీ అభిప్రాయపడ్డారు. కాగా.. నిన్న SRHతో మ్యాచ్‌లో 24బంతుల్లో 45రన్స్ చేసిన దూబే CSK టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో RCBపై 34రన్స్(28బంతుల్లో), GTపై 51(23), DCపై 18(17) చేసి జట్టులో కీలక ఆటగాడిగా మారారు.

AP: షర్మిలకు ఆదరణ వస్తోందని YCP పక్కనపెట్టినట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పార్టీని భుజాలపై వేసుకొని నడిపించారని అన్నారు. అప్పట్లో ఉపఎన్నికల్లో పోటీ చేసిన వారిని షర్మిల దగ్గరుండి గెలిపించారని గుర్తు చేశారు. ఆమెకు ఆదరణ పెరగడంతో 2014 ఎన్నికల్లో విశాఖకు పంపాలని నిర్ణయించారన్నారు. పులివెందులలో అవినాష్ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓటమిపాలయ్యారని ఆరోపించారు.

AP: రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఉండి నుంచి RRR ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. నిన్న రఘురామ టీడీపీలో చేరారు. కాగా, కొద్ది రోజుల క్రితం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించారు. తాజాగా ఆయన స్థానంలో RRR పోటీ చేయనున్నారు. దీంతో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు.

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. జనసేన, బీజేపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అన్నీ పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేరళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మంజుమ్మల్ బాయ్స్’ నేడు తెలుగులో రిలీజైంది. ఓ గుహలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసే పోరాటమే ప్రధాన కథ. ఒరిజినల్ స్టోరీని డైరెక్టర్ చిదంబరం ఉత్కంఠగా తెరకెక్కించారు. విజువల్, BGM, స్టోరీ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ స్లోగా ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
RATING: 3/5
Sorry, no posts matched your criteria.