News April 1, 2024

నా బయోపిక్‌లో నటిస్తున్నా: యువరాజ్ ట్వీట్

image

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నటుడిగా మారుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘నా సొంత బయోపిక్‌లో నటించాలని నిర్ణయించుకున్నా. దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్‌గా మారబోతున్నా. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. రాబోయే కొన్నేళ్లలో బిగ్ స్క్రీన్‌పై తుది ఫలితాన్ని చూస్తారు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇస్తా’ అని తెలిపారు. అయితే, యూవీ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 1, 2024

మైసూరు మహారాజుకు సొంతిల్లు, కారు లేవట!

image

కర్ణాటకలోని మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త వడియార్ మైసూరు- కొడగు ఎంపీ స్థానంలో BJP తరఫున నామినేషన్ దాఖలు చేశారు. తన మొత్తం ఆస్తులు ₹4.99 కోట్లని వెల్లడించారు. అయితే సొంత ఇల్లు, భూమి, కారు లేవని పేర్కొన్నారు. తన భార్య త్రిషిక కుమారి పేరిట ₹1.04 కోట్లు, పిల్లల పేరిట ₹3.64 కోట్లు ఉన్నాయన్నారు. కాగా మైసూరు రాజ్యాన్ని వడియార్ ఫ్యామిలీ 1339 నుంచి 1950 వరకు పాలించింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 1, 2024

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

image

TG: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కావ్యను వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కావ్య అనూహ్యంగా టికెట్ వద్దనుకుని, BRSకు రాజీనామా చేశారు. హస్తం పార్టీలో చేరగా.. తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది.

News April 1, 2024

టోల్ ఛార్జీల పెంపు వాయిదా

image

ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జీల పెంపును ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని NHAIను ఈసీ ఆదేశించింది. దీంతో పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు NHAI సూచించింది. ఇవాళ వసూలు చేసిన మొత్తాలను వాహనదారుల అకౌంట్లలో తిరిగి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఛార్జీలు సగటున 5 శాతం పెరిగిన విషయం తెలిసిందే.

News April 1, 2024

పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష AP PGCET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మే 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.650 చెల్లించాలి. మే 31 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూన్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News April 1, 2024

ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి ‘భీమా’!

image

గోపీచంద్ నటించిన భీమా సినిమా OTT హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని గతంలో వార్తలురాగా, ఒక రోజు ముందుగానే OTTలోకి రానుందని సమాచారం. 5న ఎక్కువ సినిమాల రిలీజ్ ఉండటంతో స్ట్రీమింగ్‌ తేదీని ముందుకు మార్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

News April 1, 2024

ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు.. ఎందుకంటే?

image

VVPAT స్లిప్పులను క్షుణ్ణంగా లెక్కించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపిక చేసిన 5 EVMలలో నమోదైన ఓట్లకు సంబంధించిన VVPAT స్లిప్పులను లెక్కిస్తారు. ప్రతి EVM ఓటును VVPAT స్లిప్‌లతో పోల్చాలని పిటిషనర్ కోరారు. జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ EVM, VVPAT పనితీరులో తప్పులు జరుగుతున్నాయని సుప్రీంను ఆశ్రయించారు.

News April 1, 2024

SHOCKING: ఎక్కువ సేపు పనిచేస్తున్నారా?

image

ఇతర దేశాల్లోని ఐటీ నిపుణులతో పోల్చితే భారత ఉద్యోగులు పని పట్ల ఎంతో ప్రేమగా ఉంటారట. వీరు వారంలో జాతీయ సగటు (47.7 గంటలు) కంటే ఎక్కువగా 52.5 గంటలు పనిచేస్తున్నారు. KCCI సర్వే ప్రకారం 51% మంది భారతీయ టెక్కీలు 9-12 గంటలు పనిలో గడుపుతున్నట్లు తేలింది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల టెక్కీలు ఎసిడిటీ, వెన్ను & మెడ నొప్పి, నిద్రలేమి, కండరాలు పట్టుకోవడం, కంటి చూపు సమస్యలు, బరువు పెరుగుతున్నారని తెలిసింది.

News April 1, 2024

‘టిల్లు స్వ్కేర్’ సీక్వల్ రాబోతోంది!

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే DJ టిల్లు, టిల్లు స్క్వేర్‌తో వచ్చిన సిద్ధూ.. ‘టిల్లు క్యూబ్’తో మరోసారి అలరించనున్నారు. ఈ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ మూడు రెట్లు ఉంటుందంటున్నారు.

News April 1, 2024

అత్యధిక డకౌట్ల రికార్డు సమం

image

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. IPLలో ఎక్కువసార్లు(17) డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ సరసన చేరారు. 15 డకౌట్లతో మ్యాక్స్‌వెల్, పియూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నారు.