News April 23, 2025

పహల్గాం దాడి కలచివేసింది: ట్రంప్

image

J&K పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ‘చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రధాని మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు.

Similar News

News August 6, 2025

మోదీని గద్దె దించుతాం: రేవంత్

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధాని మోదీని గద్దె దించుతామని CM రేవంత్ హెచ్చరించారు. BC రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. తాము కేంద్రానికి పంపిన 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. BC రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు.

News August 6, 2025

ప్రకటనలు, సంక్షేమ పథకాల్లో CM ఫొటో ఉండొచ్చు: సుప్రీం తీర్పు

image

సంక్షేమ పథకాల్లో CMల పేర్లు, ఫొటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. CM ఫొటో వాడుకోవచ్చని CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు CM పేరు, ఫొటోలు వాడటంపై AIDMK హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు వచ్చింది. దీనిని TN GOVT SCలో సవాల్ చేయడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని AIDMK నేతకు రూ.10లక్షల ఫైన్ వేసింది.

News August 6, 2025

యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు: RBI గవర్నర్

image

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.