News August 13, 2024
పీరియడ్స్ తర్వాత నొప్పి.. కారణమిదేనా?
కొంతమంది స్త్రీలలో నెలసరి తర్వాతా పొత్తి కడుపులో నొప్పి కొనసాగుతుంది. అందుకు కారణం పోస్ట్ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కావొచ్చంటున్నారు గైనకాలజిస్టులు. ‘20 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. నీరసం, మూడ్ స్వింగ్స్, తలనొప్పి, ఆందోళన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. అస్తవ్యస్తమైన జీవన శైలే దీనికి కారణం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవన విధానంతో మెల్లగా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఛాన్స్ ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
Similar News
News September 9, 2024
‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.
News September 9, 2024
ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. వివరాలు ఇవే
AP: నిన్నటి నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ 8 ఉ.8.30 నుంచి 9వ తేదీ ఉ.8.30 గంటల వరకు వర్షపాతం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో 115 నుంచి 204 మి.మీ వరకు వర్షం పడింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షపాతం వివరాలను పై ఫొటోలో చూడొచ్చు.
News September 9, 2024
మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
*https://uidai.gov.in/en/లోకి వెళ్లి My Aadhaar సెలక్ట్ చేసుకోవాలి.
*ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి.
*చెక్ బాక్స్‌లో డౌన్‌లోడ్ మాస్క్‌డ్ ఆధార్‌పై టిక్ చేయాలి.
*సబ్మిట్ ఆప్షన్ నొక్కగానే మాస్క్‌డ్ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
>>ఇందులో ఆధార్‌లోని మొదటి 8 అంకెలు కనిపించకపోవడం వల్ల మోసపోయే అవకాశాలు తక్కువ.