News August 7, 2024

కూల్‌గా ఉంచే పెయింట్.. అమెరికా శాస్త్రవేత్త ఏమన్నారంటే?

image

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏర్పాటు చేసుకున్న ACలు అవసరం ఉండదని పర్డ్యూ యూనివర్సిటీ (USA) శాస్త్రవేత్త జియులిన్ చెబుతున్నారు. ఆయన ఇటీవల భవనాలను చల్లబరిచే పెయింట్‌ను అభివృద్ధి చేశారు. ఇది 98% సూర్యకిరణాలను ప్రతిబింబించేలా చేస్తుందని, పగటి పూట 8 డిగ్రీలు, రాత్రి 19 డిగ్రీల వరకు తగ్గిస్తుందని తెలిపారు. పైకప్పుపై ఈ పెయింట్ వేయడం వల్ల శీతలీకరణ శక్తి పెరిగి విద్యుత్ వినియోగం తగ్గుతుందని చెప్పారు.

Similar News

News September 19, 2024

భారత చెస్ జట్లు అదుర్స్!

image

చెస్ ఒలింపియాడ్‌ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.

News September 19, 2024

కంటిచూపు మెరుగుపడాలంటే..

image

*పాలకూర, తోటకూర, కొలార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* విటమిన్ E ఎక్కువగా ఉండే బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ విత్తనాలు తినాలి.
*స్వీట్ పొటాటోల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
*ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లతో పాటు క్యారెట్లు తినాలి.

News September 19, 2024

ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు

image

AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.