News January 31, 2025

CT-2025.. జట్టును ప్రకటించిన పాక్

image

CT-2025కు పాకిస్థాన్ 15 మందితో జట్టును ప్రకటించింది. రిజ్వాన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నారు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు జట్టులో స్థానం దక్కింది. FEB 19న CT-2025 మొదలు కానుండగా, పాక్‌తో భారత్ 23న మ్యాచ్ ఆడనుంది.
జట్టు: రిజ్వాన్ (C), బాబర్ ఆజామ్, ఫఖర్, కమ్రాన్, సకీల్, తయాబ్, ఫహీమ్, ఖుష్ దిల్, సల్మాన్ అఘా, ఉస్మాన్, అబ్రార్, హరీస్, హస్‌నైన్, నసీమ్, షాహీన్.

Similar News

News February 13, 2025

ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్న

image

AP: బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.

News February 13, 2025

తొలి లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు: శివ కార్తికేయన్

image

తన లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని తమిళ హీరో శివకార్తికేయన్ వెల్లడించారు. ‘నాది వన్ సైడ్ లవ్. అప్పటికే ఆమెకు లవర్ ఉన్నాడు. దూరం నుంచే చూస్తూ ప్రేమించా. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్‌లో కనిపించింది. అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని వివాహమాడింది. నాకు దొరకని అమ్మాయి ఆ వ్యక్తికీ దొరకలేదు’ అని నవ్వుతూ చెప్పారు.

News February 13, 2025

అన్‌లిమిటెడ్ పానీపూరీ.. ఎక్కడంటే?

image

వినోదాన్ని పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నట్లుగానే పానీపూరీ తినేందుకు ఉండాలని ఓ వ్యక్తి ఆలోచించాడు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం అన్‌లిమిటెడ్ పానీపూరీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఒకేసారి డబ్బు చెల్లించాలని పేర్కొన్నాడు. ఈ ఆఫర్ తీసుకున్నవారు ఏ సమయంలోనైనా షాప్‌కి వచ్చి పానీపూరీ తినొచ్చని తెలిపాడు. గతంలోనూ బాహుబలి పానీపూరీ పేరుతో ఆయన క్యాష్ ప్రైజ్‌లు ప్రకటించారు.

error: Content is protected !!