News May 7, 2025
పాక్ నేవీ విన్యాసాలు.. భారత్‌కు పరోక్ష వార్నింగ్!

భారత ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అటు ఏ మిషన్‌కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.
Similar News
News January 24, 2026
యాత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,979 పోస్టులు

యాత్ర ఇండియా లిమిటెడ్ 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, టెన్త్ అర్హత గలవారు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అర్హత గలవారికి నెలకు రూ.8200, ఐటీఐ అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://recruit-gov.com/
News January 24, 2026
మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్‌ఎస్ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.
News January 24, 2026
బెంగాల్‌లో SIRపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి

WBలో నిర్వహిస్తున్న SIRపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో హడావిడిగా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ‘ఓటర్ల జాబితాను సమీక్షించాలనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం బెంగాల్‌లో జరగుతున్నది అలా లేదు. ఓటు హక్కు నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అందించడానికి తగిన సమయమివ్వాలి’ అని చెప్పారు.


