News February 13, 2025
LoC వద్ద రెచ్చిపోయిన పాక్.. తిప్పికొట్టిన భారత్!

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు తెగబడగా భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల LoC వద్ద ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News March 21, 2025
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.
News March 21, 2025
ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.