News November 10, 2024

బీసీసీఐపై కోర్టుకెళ్లనున్న పాక్?

image

పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు BCCI నిరాకరించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ మ్యాచులను దుబాయ్‌లో ఆడేలా హైబ్రిడ్ షెడ్యూల్‌ని PCBకి బీసీసీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించాలని పాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ దేశం నుంచి ఒక్క మ్యాచ్‌ను కూడా బయటికి తరలించే ప్రసక్తే లేదని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఇప్పటికే తేల్చిచెప్పారు.

Similar News

News January 15, 2026

నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్‌

image

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్‌ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.

News January 15, 2026

సంక్రాంతి: ఈ వస్తువులు కొంటే శ్రేయస్సు

image

సంక్రాంతి వేళ ఇంటికి శ్రేయస్సు తెచ్చే వస్తువులు కొనడం ఎంతో శుభప్రదమంటున్నారు వాస్తు నిపుణులు. ‘ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్స్, ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తర దిశలో లోహపు తాబేలు, అదృష్టం కోసం క్రిస్టల్ వస్తువులు ఉంచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధాన ద్వారానికి లక్కీ నాణేలు, దాంపత్య బంధం బలపడటానికి నైరుతి దిశలో మాండరిన్ బాతుల జంటను ఏర్పాటు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

image

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.