News July 22, 2024
ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి?
హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పాక్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సజల్ ఒకరు. ఆమె 2017లో శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మామ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Similar News
News December 9, 2024
మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో గొడవ తారస్థాయికి చేరుతోంది. తనపై దాడి చేశారంటూ కొద్దిసేపటి క్రితమే మనోజ్ పహాడీ షరీఫ్ PSలో ఫిర్యాదు చేశారు. తాజాగా తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన లేఖ రాశారు. మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందోనని మంచు అభిమానులు చర్చించుకుంటున్నారు.
News December 9, 2024
టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
AP: రాజ్యసభ సభ్యులను టీడీపీ ఖరారు చేసింది. బీద మస్తాన్ రావు(నెల్లూరు), సానా సతీశ్(కాకినాడ) పేర్లను ప్రకటించింది. కాగా బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యను ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రేపు వీరంతా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఈ మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
News December 9, 2024
కేజీ టమాటా రూపాయి
AP: నిన్నమొన్నటి వరకు రైతులకు లాభాలు ఆర్జించి పెట్టిన టమాటా ఒక్కసారిగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో కిలో టమాటా ధర ఏకంగా రూపాయికి పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లేక అన్నదాతలు టమాటాలను పారబోస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సహా పలు నగరాల్లో కేజీ టమాటా రూ.30-40 పలుకుతోంది.