News December 12, 2024

‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‌’గా పాక్ క్రికెటర్

image

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‌’గా పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఎంపికయ్యారు. నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఐసీసీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ కూడా ఈ అవార్డుకు పోటీపడ్డారు. కాగా గత నెలలో రవూఫ్ ఒక ఐదు వికెట్ల ప్రదర్శనతోపాటు మొత్తం 18 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆయన అద్భుతంగా రాణించారు.

Similar News

News January 15, 2025

తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న కమిటీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసిన పతకాలలో నాణ్యత లేదని అథ్లెట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని IOC ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారుచేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ప్రఖ్యాత ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలను రూపొందించారు.

News January 15, 2025

లాస్ ఏంజెలిస్‌లో ఆరని కార్చిచ్చు

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నా వారికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. కాలిఫోర్నియాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. దీంతో మంటల వ్యాప్తి పెరిగే అవకాశముంది. నిరాశ్రయులైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 24 మంది మరణించగా 88వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

News January 15, 2025

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
1956: BSP చీఫ్ మాయావతి జననం
1967: సినీ నటి భానుప్రియ జననం
1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
**భారత సైనిక దినోత్సవం