News August 25, 2024

పాక్ ఓటమి.. బంగ్లాదేశ్‌కు చరిత్రాత్మక విజయం

image

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10వికెట్ల తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి విజయం. పాక్ గడ్డపై 10వికెట్ల తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగానూ BAN రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 448/6 రన్స్‌కు డిక్లేర్ ఇచ్చిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 146పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 565, రెండో ఇన్నింగ్స్‌లో 30రన్స్‌ చేసి బంగ్లా గెలిచింది.

Similar News

News December 2, 2025

ప్రదోషాల గురించి మీకు ఇవి తెలుసా?

image

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోషం అంటారు. ఆ తిథి ఏ వారంలో వస్తుందో దాన్ని బట్టి ఆ ప్రదోషానికి ప్రత్యేక నామం ఉంటుంది.
త్రయోదశి తిథి ఆదివారం వస్తే రవి ప్రదోషం. సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం. మంగళవారం వస్తే భౌమ ప్రదోషం. బుధవారం వస్తే బుధ ప్రదోషం. గురువారం వస్తే గురు ప్రదోషం. శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం. శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు.

News December 2, 2025

రాష్ట్రంలో శామీర్‌పేట్ PSకు ఫస్ట్ ప్లేస్

image

TG: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్(D) శామీర్‌పేట్ PS 7వ స్థానం, రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్‌ సాధించింది. PS పని తీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో వ్యవహరించే తీరు తదితర అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలూ పరిశీలించింది. ఏటా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను MHA ఎంపిక చేస్తుంది.

News December 2, 2025

నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

image

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.