News April 29, 2024
హార్వర్డ్‌లో అమెరికా పతాకం స్థానంలో పాలస్తీనా జెండా
పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొంతమంది దుండగులు అమెరికా జెండాను దించి, పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు తెంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. హార్వర్డ్ మేనేజ్‌మెంట్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. దీనికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది.
Similar News
News November 4, 2024
‘స్పిరిట్’లో ప్రభాస్ హీరోయిన్ ఈమేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ స్క్రిప్టు నయన్‌కు నచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2007లో వీరిద్దరూ కలిసి ‘యోగి’లో నటించారు.
News November 4, 2024
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్ రెడ్డి
TG: డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, కనీసం వాటి గురించి సమాచారం కూడా ఇవ్వడం లేదని అన్నారు. TG ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.
News November 4, 2024
ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది: మరాఠా కోటా యాక్టివిస్ట్
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయడం లేదని మరాఠా కోటా యాక్టివిస్ట్ మనోజ్ పాటిల్ అన్నారు. 10-15 మంది అభ్యర్థులకు మద్దతిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ‘ఒకే కులం బలంతోనే గెలవలేం. పైగా రాజకీయాలకు మేం కొత్త. ఒకవేళ మేం పోటీచేసి ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది’ అని తెలిపారు. ఆయన నిర్ణయంతో శివసేన UBT, కాంగ్రెస్, పవార్ NCPకి లబ్ధి కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.