News March 18, 2024
పల్నాడు: 2 బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ఉన్న మమత, గుణశేఖర్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Similar News
News October 26, 2025
GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.
News October 26, 2025
తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 26, 2025
గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


