News March 17, 2024

పల్నాడు: ‘144 సెక్షన్ అమల్లో ఉంటుంది’

image

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.

Similar News

News March 29, 2026

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో 1100 మందికి ఉద్యోగాలు

image

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఈఏడాది 1100మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. తర్వాత రీసెర్స్ నెక్సస్ జర్నల్ ఆవిష్కరించారు. ఏఐ రాకతో MNCలో ఉద్యోగాలు రావడం చాలా కష్టమని.. విద్యార్థులు స్కిల్స్ పెంచుకోవాలని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.

News March 29, 2026

ఆర్డర్లు రాకముందే బదిలీ చర్చలు.. గుంటూరులో హాట్ టాపిక్

image

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీపై గత 10 రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమెకు విద్యాశాఖ డైరెక్టర్ పదవి దక్కనున్నట్లు ముందుగానే ప్రచారం జరగడం గమనార్హం. బదిలీ నిలిపివేయాలని కోరుతూ ప్రజాసంఘాలు పీజీఆర్‌ఎస్‌లో జేసీ అశుతోష్ మిశ్రాకు వినతిపత్రం సైతం సమర్పించారు. అధికారిక ఉత్తర్వులు రాకముందే వివరాలు వెలుగులోకి రావడం, బదిలీ సైతం ఆపాలని వినతి పత్రం ఇవ్వటం చర్చనీయాంశమైంది.

News March 29, 2026

PGRSని సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో
కూడా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలను తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.