News March 17, 2024

పల్నాడు: ‘144 సెక్షన్ అమల్లో ఉంటుంది’

image

పదో తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు DEO వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడనని అన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 29,243మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 గంటలకల్లా విద్యార్థులు చేరుకోవాలన్నారు.

Similar News

News October 12, 2024

గుంటూరు: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 11, 2024

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

News October 11, 2024

జగన్‌కు ఆత్మ చెప్పిందేమో: లోకేశ్

image

రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారని విమర్శించారు.