News January 31, 2025
పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై SEC కీలక ఆదేశాలు

TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది.
Similar News
News September 18, 2025
తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,41,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.