News January 31, 2025

పంచాయతీ ఎన్నికలు.. ఓటర్ల జాబితాపై SEC కీలక ఆదేశాలు

image

TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది.

Similar News

News February 16, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనదే హవా

image

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.

News February 16, 2025

ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20,000: మంత్రి

image

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్‌కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.

News February 16, 2025

మస్తాన్ సాయి కేసు.. గవర్నర్‌కు లావణ్య లాయర్ లేఖ

image

AP: <<15471142>>మస్తాన్‌సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.

error: Content is protected !!