News April 25, 2024
పంచాయతీ ఎన్నికలు ‘బ్యాలెట్’తోనే..
TG: లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్‌లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియగా.. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
Similar News
News January 20, 2025
సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.
News January 20, 2025
బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్
బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
News January 20, 2025
షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు
బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్‌ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.