News May 20, 2024
అన్నాడీఎంకే గూటికి పన్నీర్ సెల్వం?
లోక్‌సభ ఎన్నికల తర్వాత AIADMK బహిష్కృత నేత పన్నీర్ సెల్వంను తిరిగి ఆ పార్టీలోకి తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన రామనాథపురం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. BJP, AIADMK వేర్వేరుగా కూటములు ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఓట్ల చీలిక అధికార DMKకు మేలు చేస్తుందనేది విశ్లేషకుల మాట. దీంతో సమైఖ్య AIADMK లక్ష్యంగా పన్నీర్‌ను పార్టీలోకి తెచ్చేలా యత్నాలు జరుగుతున్నాయట.
Similar News
News December 11, 2024
నో.. నో: రాహుల్‌కు షాకిచ్చిన కేజ్రీవాల్
కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ఆమ్‌ఆద్మీ షాకిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు 1-2, మిగిలిన వాటిలో ఆప్ పోటీచేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ANI చేసిన ట్వీటుకు అరవింద్ కేజ్రీవాల్ పైవిధంగా బదులిచ్చారు.
News December 11, 2024
నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్.. చివరికి!
స్త్రీ-2, వెల్‌కమ్ చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. గతనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసి UP తీసుకెళ్లారు. గన్నుతో బెదిరించి 12 గంటలు టార్చర్ పెట్టారు. అతడి కొడుకుకి ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. ఇంతలో కిడ్నాపర్ల చెర నుంచి ముస్తాక్ తప్పించుకొన్నాడు’ అని ఆయన ఫ్రెండ్ శివమ్ తెలిపారు.
News December 11, 2024
‘సరైన తిండి’ తినాలనుకోవడమూ ఓ రోగమేనట!
Orthorexia పేరెప్పుడైనా విన్నారా? గ్రీకులోorthos అంటే right. ఇక orexis అంటే appetite. సింపుల్‌గా కరెక్ట్ డైట్ అని పిలుచుకోవచ్చు. స్వచ్ఛమైన, నాణ్యమైన ఫుడ్ తినాలనే అందరికీ ఉంటుంది. కొందరిలో మాత్రం అతిగా ఉంటుంది. తెలియకుండానే ఒక పొసెసివ్‌నెస్ వచ్చేసింది. దీనినే Orthorexia అంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకొంటూ తిండి తగ్గించేయడం, కొన్ని ఆహారాలను అస్యహించుకోవడం, కొన్నిటినే తింటూ బక్కచిక్కిపోవడం దీని లక్షణం.