News April 29, 2024
టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్‌గా పంత్?

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను నియమించే అవకాశాలున్నాయని CRICBUZZ పేర్కొంది. ఈ లీడర్‌షిప్ రోల్ కోసం అతను హార్దిక్ పాండ్యతో పోటీలో ఉన్నాడని తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ IPLతో రీఎంట్రీ ఇచ్చి బ్యాటింగ్, కీపింగ్‌లో రాణిస్తున్నారు. మరోవైపు హార్దిక్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెలక్టర్లు పంత్‌ను రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించాలని భావిస్తున్నారట.
Similar News
News April 15, 2026
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News April 15, 2026
ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.


