News March 23, 2024

సుదీర్ఘ విరామం తర్వాత పంత్ మ్యాచ్

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడనున్నారు. IPLలో భాగంగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నారు. 2022 డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకున్న అతడు పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఇటీవలే ఫుల్ ఫిట్నెస్ సాధించిన ఈ ఢిల్లీ కెప్టెన్ బ్యాటింగ్ కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 10, 2024

త్వరలో ‘బుడమేరు ఆపరేషన్’: మంత్రి నారాయణ

image

AP: విజయవాడలో విలయానికి కారణమైన బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా త్వరలోనే ‘బుడమేరు ఆపరేషన్’ చేపడతామని CM చెప్పారన్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, బిస్కెట్లు, పాలు, పండ్లు పంపిణీ చేశామని, నిన్న కూడా 3 లక్షల ఫుడ్ ప్యాకెట్లు అందించామని చెప్పారు. ఇప్పటి వరకు 77వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

News September 10, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

image

AP: పల్నాడు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉ.10.30 గం. కంటే ముందు, మ.3 గం.కు, సా.5 తర్వాత అటెండెన్స్ వేయాలంది. గతంలోనే ఈ రూల్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, MPDOలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.

News September 10, 2024

M&M, డాక్టర్ రెడ్డీస్ నుంచి సెబీ చీఫ్‌కు కోట్లలో ఆదాయం: కాంగ్రెస్

image

M&M, డాక్టర్ రెడ్డీస్ సహా ఇతర లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ చీఫ్ మాధబీ బుచ్ రూ.కోట్లలో ఆదాయం పొందారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో చేరినప్పటి నుంచి ఆమెకు చెందిన అగోరా అడ్వైజర్ కంపెనీ సుప్తావస్థలో ఉందంటున్నా 2016-2024 మధ్య రూ.2.95 కోట్లు పొందారని పేర్కొన్నారు. పిడిలైట్, ICICI, సెంబ్‌కార్ప్, విసు లీజింగ్ వారి క్లెయింట్లేనని చెప్పారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందన్నారు.