News December 3, 2024

10-12 ఏళ్లు మాతోనే పంత్: సంజీవ్ గొయెంకా

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ తమతోపాటు 10-12 ఏళ్లు ఉంటారని లక్నో జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా అభిప్రాయపడ్డారు. వేలంలో ఆయనను దక్కించుకోవడంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. ‘ప్రస్తుతం మా జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారు. పంత్‌, మార్‌క్రమ్, పూరన్, మార్ష్ కెప్టెన్సీకి అర్హులే. వీరందరూ గెలవాలనే కసి, తపనతో ఉంటారు. ప్రస్తుతం అన్ని జట్ల కన్నా తమ జట్టే బలంగా, సమతుల్యంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

తిరుమల శ్రీవారి ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీపై అప్డేట్ వచ్చింది. ఈనెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెల అకామొడేషన్ కోటా బుకింగ్స్ కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

News January 16, 2025

సంక్రాంతి సీజన్‌లో తొలిసారి.. అన్నీ రూ.100 కోట్ల క్లబ్‌లోనే!

image

సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్‌ అవ్వవు. అలాగే కలెక్షన్లూ రాబట్టలేవు. కానీ, ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా నేడు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ మార్క్ దాటనుంది. ఇలా సంక్రాంతి సీజన్‌లో అన్ని మూవీస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం మొదటిసారి కానుందని సినీవర్గాలు తెలిపాయి.

News January 16, 2025

BREAKING: సముద్రంలో మునిగి ముగ్గురు మృతి

image

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోగా, ఒకరిని జాలర్లు కాపాడారు. మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు. డెడ్ బాడీలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.