News March 17, 2024

పాపన్నపేట: తండ్రిని చంపిన తనయుడు

image

పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో సంగం ప్రేమానందం(45)ను కొడుకు సందీప్ కొట్టి ఉరివేసి హత్య చేసినట్లు SI నరేశ్ తెలిపారు. తాగుడుకు బానిసైన ప్రేమానందం తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు పంచాయతీ నిర్వహించిన మార్పు రాకపోగా బుధవారం మళ్లీ గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన కొడుకు సందీప్.. తండ్రిని కొట్టి ఉరేసి చంపేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Similar News

News January 19, 2026

‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.

News January 19, 2026

నేడు ‘ప్రజావాణి’ రద్దు: మెదక్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

News January 17, 2026

మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.