News December 14, 2024

పారాసెటమాల్‌తో వృద్ధుల్లో గుండె, కిడ్నీ సమస్యలు: అధ్యయనం

image

పారాసెటమాల్‌ను ఎక్కువగా వాడటం ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరానికి వాడే ఈ ఔషధాన్ని వృద్ధుల్లో కీళ్లనొప్పులకు కూడా వైద్యులు సిఫారసు చేస్తుంటారు. దీర్ఘకాలంలో ఇది అంత మంచిది కాదని UKలోని నాటింగ్‌హామ్ పరిశోధకులు చెబుతున్నారు. 65ఏళ్లకు పైబడిన 1.80లక్షలమందిపై అధ్యయనం చేశామని, పారాసెటమాల్ వలన వృద్ధుల్లో కిడ్నీ, గుండె, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయని గుర్తించామని పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

వేరుశనగ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వేరుశనగ పంట కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను పీకేటప్పుడు నేల గుల్లగా ఉండేలా చూసుకోవాలి. పంటలో 70 నుంచి 80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగులోకి మారి, కాయడొల్ల లోపల భాగం నలుపు రంగులోకి మారినప్పుడే పంటను కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క నుంచి కాయలను వేరుచేశాక కాయలను నిల్వచేసినప్పుడు, బూజుతెగులు రాకుండా స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి.

News November 17, 2025

VIRAL: ప్రభాస్ లేటెస్ట్ లుక్

image

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఫొటోలు వైరలవుతున్నాయి. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR, నటుడు సుబ్బరాజుతో కలిసి ఫొటోలు దిగారు. ఎప్పుడూ తలకు క్లాత్ ధరించి కనిపించే ఆయన చాలారోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

News November 17, 2025

16 పోస్టులకు ఐఐసీటీ నోటిఫికేషన్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<>IICT<<>>)16 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://iict.res.in/