News December 14, 2024
పారాసెటమాల్‌తో వృద్ధుల్లో గుండె, కిడ్నీ సమస్యలు: అధ్యయనం
పారాసెటమాల్‌ను ఎక్కువగా వాడటం ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరానికి వాడే ఈ ఔషధాన్ని వృద్ధుల్లో కీళ్లనొప్పులకు కూడా వైద్యులు సిఫారసు చేస్తుంటారు. దీర్ఘకాలంలో ఇది అంత మంచిది కాదని UKలోని నాటింగ్‌హామ్ పరిశోధకులు చెబుతున్నారు. 65ఏళ్లకు పైబడిన 1.80లక్షలమందిపై అధ్యయనం చేశామని, పారాసెటమాల్ వలన వృద్ధుల్లో కిడ్నీ, గుండె, ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయని గుర్తించామని పేర్కొన్నారు.
Similar News
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.