News August 31, 2024

PARALYMPICS: 7 నెలల గర్భంతో బరిలోకి..

image

పారిస్ పారాలింపిక్స్‌లో బ్రిటన్‌కు చెందిన ఆర్చర్ జోడీ గ్రిన్‌హమ్ 7 నెలల గర్భంతో బరిలోకి దిగారు. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో 693 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో రజత పతకం కోల్పోయారు. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో నాథన్ మాక్‌క్విన్‌తో కలిసి ఆడి రెండో స్థానంలో నిలిచారు. ఒకే రోజు ఆమె ఈ రెండు ఈవెంట్లలో పాల్గొనడం విశేషం. కాగా రియో పారాలింపిక్స్‌లో ఆమె రజత పతకం నెగ్గారు.

Similar News

News February 10, 2025

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

News February 10, 2025

5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

image

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News February 10, 2025

ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

image

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో

error: Content is protected !!