News September 5, 2024
పారాలింపిక్స్: 14వ స్థానంలో భారత్
పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. మెన్స్ క్లబ్ త్రో F51 విభాగంలో ధరంబీర్ బంగారు పతకం, ప్రణవ్ సూర్మా సిల్వర్ సాధించారు. దీంతో మొత్తం 25 పతకాలతో భారత్ 14వ స్థానంలో నిలిచింది. అందులో 5 గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం 146 పతకాలతో చైనా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
Similar News
News September 8, 2024
ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!
గుజరాత్ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెందడం కలకలం రేపింది. భారీ వర్షాల తరువాత బాధితులకు వచ్చిన తీవ్రమైన జ్వరాన్ని వైద్యులు కచ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ సరిహద్దులో ఉండే ఈ తాలూకాలో సమస్య పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
News September 8, 2024
నా జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయి: తమన్నా
టీనేజ్‌లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
News September 8, 2024
వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ హుకుం
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను BJP ఆదేశించినట్టు తెలుస్తోంది. రెజ్లర్లపై వేధింపుల ఆరోపణల వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని, దీనికి హరియాణా EX CM భూపిందర్ సింగ్ హుడా పథక రచన చేశారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వినేశ్, బజరంగ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలని BJP ఆదేశించడం గమనార్హం.