News September 11, 2024
పారాలింపిక్స్: ఈ రాష్ట్రం నుంచే అత్యధిక మెడల్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ గెలిచిన మొత్తం 29 పతకాలు దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్లేయర్లే సాధించడం గమనార్హం. అత్యధికంగా హరియాణా నుంచి 8 మంది, తమిళనాడు నుంచి నలుగురు పతకాలు అందుకున్నారు. యూపీ, రాజస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున, J&K, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఢిల్లీ, నాగాలాండ్, కర్ణాటక నుంచి ఒక్కరు చొప్పున మెడల్స్ సాధించారు.
Similar News
News October 11, 2024
NEW TREND క్రోమింగ్.. పేరెంట్స్ జాగ్రత్త!
అమెరికాలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. పేరు క్రోమింగ్. ఇంట్లోని నెయిల్ పాలిష్, మార్కర్లు, బోర్డు డస్టర్లు, మత్తు కలిగించే ఇతర వస్తువుల వాసన పీలుస్తూ వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడమే దీని ఉద్దేశం. గతంలోని హప్ఫింగ్, పప్ఫింగ్, ర్యాగింగ్, బ్యాగింగే ఇప్పుడిలా రూపాంతరం చెందాయి. హైడ్రో కార్బన్స్‌ను పీల్చే ఈ మాయదారి ట్రెండ్ వల్ల టీనేజర్స్, చిన్నారులు వ్యసనాలు, ఆస్తమా, గుండెజబ్బుల బారిన పడుతున్నారు.
News October 11, 2024
సిరాజ్‌కు DSP పోస్ట్
TG: టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించింది. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని డీజీపీ జితేందర్ ఆయనకు అందించారు. కాగా గతంలోనే సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 11, 2024
టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు.. మరో 3 రోజులే ఛాన్స్!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: టెన్త్ పాస్ అయి ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, ARలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాల్సిన <